అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:19 PM
అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.

- కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేటటౌన్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళ వారం కలెక్టరేట్‌లో ఆమె జిల్లా అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై మాట్లాడారు. ఇళ్ల మంజూరు కోసం నియోజకవర్గా నికి ఓ ప్రత్యేకాధికారిని నియమించడం జరుగు తుందని, ఆ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో అర్హుల ఎంపిక పారదర్శకంగా చేయాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చేటట్లు చూడా లన్నారు. నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇందిరమ్మ ఇళ్లను అర్హులందరికి వచ్చేలా అధి కారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. అనంతరం భూభారతిపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్‌షాలం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీవో రాంచందర్‌నాయక్ తదితరులున్నారు.