Share News

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:17 PM

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్ది పొందాలని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాంపురం సదాశివారెడ్డి అన్నారు.

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
అప్పిరెడ్డిపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మార్కెట్‌ చైర్మన్‌ రాంపురం సదాశివారెడ్డి

- పేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సదాశివారెడ్డి

నారాయణపేట రూరల్‌/ దామరగిద్ద/మక్తల్‌ రూరల్‌/ కొత్తపల్లి/మద్దూర్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్ది పొందాలని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాంపురం సదాశివారెడ్డి అన్నారు. మంగళవారం పేట మండలంలోని కోటకొండ, అప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. వరి మేలు రకం క్వింటాల్‌కు రూ.2320, సాధారణ రకం రూ.2300లకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అనంతరం ఆయన పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమాల్లో సుభాన్‌రెడ్డి, మార్కెట్‌ డైరెక్టర్‌ శరణప్ప, మాజీ సర్పంచ్‌ జయలక్ష్మీ, ప్రభంజన్‌రావు, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.

అదేవిధంగా, దామరగిద్ద మండలం ఆశన్‌పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ పుట్టి ఈదప్ప, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సాయిరెడ్డి, సురేందర్‌రెడ్డి, భగవంతు, నవీన్‌రెడ్డి, సదానందం, గోవింద్‌రెడ్డి, శ్యామ్యుల్‌, రైతులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పిడెంపల్లి, లోకూర్తి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్‌ పుట్టి ఈదప్ప స్థా నిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఏపీఎం నర్సింలు, పిడెంపల్లి రఘు, బాల్‌రెడ్డి, తమ్మ లి రఘు, లక్ష్మణ్‌, రైతులు పాల్గొన్నారు.

మక్తల్‌ మండలం జక్లేర్‌ గ్రామంలో ఐకేపీ, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ గవినోళ్ల రాధాలక్ష్మారెడ్డి ప్రారంభించి, మాట్లాడారు. ఏవో మిథున్‌చక్రవర్తి, మార్కెట్‌ డైరెక్టర్లు రంజిత్‌రెడ్డి, ఎం.శ్రీనివాసులు, రైతులు ఉన్నారు.

కొత్తపల్లి మండల కేంద్రంతో పాటు, భూనీడు, గోర్లొనిబాయి, గోకుల్‌నగర్‌, మన్నాపూర్‌, నిడ్జింత గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం నారాయణ, మండల నాయకులు ప్రారంభించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కొట్ల మహీందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు నర్సిములు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీములు, శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌రెడ్డి, పార్థివగౌడ్‌ తదితరులున్నారు.

మద్దూర్‌ మండలం దోరేపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌ భీములు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు నర్సింహ, జ డ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి ప్రారం భించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోం దని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకుడు రామకృష్ణ, కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 11:17 PM