Bhatti: బీజేపీకి ఓటేస్తే.. రిజర్వేషన్ల రద్దు..
ABN, Publish Date - May 08 , 2024 | 04:38 AM
దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించి.. వాళ్లను బానిసలుగా మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆ పార్టీని ఓడించాలి
బీజేపీకి కేసీఆర్ వత్తాసు సిగ్గుచేటు: భట్టి
హైదరాబాద్, మే 7(ఆంధ్రజ్యోతి): దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించి.. వాళ్లను బానిసలుగా మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో పొరపాటున ఆ పార్టీకి ఓటేస్తే.. ఆయా వర్గాలకు భవిష్యత్తు లేకుండా పోతుందన్నారు. దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత 90 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలపై ఉందన్నారు.
గాంధీ భవన్‌లో మంగళవారం భట్టి మీడియాతో మాట్లాడారు. జనగణన చేపట్టి రిజర్వేషన్లతో పాటు వనరులు, సంపద, రాజ్యాధికారంలో ఈ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పిస్తామని రాహుల్‌గాంధీ చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా ఈ ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపించాలని కోరారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోయాయని.. బీజేపీకి కేసీఆర్ వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో కాంగ్రె స్ 14 ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది మే మొదటి వారంతో పోలిస్తే ఈసారి విద్యుత్తు డిమాండ్ 52.9ు పెరిగిందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 47.6ు పెరుగుదల నమోదైందని చెప్పారు. విద్యుత్తు కోతలు ఉన్నట్లు ప్రతిపక్షాలు గోబెల్స్ ప్రచారం చేయడం తగదన్నారు.
Updated Date - May 08 , 2024 | 04:38 AM