ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ..

ABN, Publish Date - Sep 28 , 2024 | 03:55 AM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కలకలం రేపింది. ఇంటి వాచ్‌మన్‌ తన స్నేహితుడితో కలసి దొంగతనానికి పాల్పడి పారిపోగా.. పశ్చిమ బెంగాల్‌లో వారిని పట్టుకున్నారు.

  • బెంగాల్‌లో చిక్కిన నిందితులు

బంజారాహిల్స్‌, సెప్టెంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కలకలం రేపింది. ఇంటి వాచ్‌మన్‌ తన స్నేహితుడితో కలసి దొంగతనానికి పాల్పడి పారిపోగా.. పశ్చిమ బెంగాల్‌లో వారిని పట్టుకున్నారు. కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడిన తర్వాత భట్టి కుటుంబం ప్రజాభవన్‌కు మారడంతో బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 14లోని ఆయన ఇల్లు ఖాళీగానే ఉంది. ఆ ఇంటి బాగోగులు చూసేందుకు రోషన్‌ మండల్‌ అనే వ్యక్తిని వాచ్‌మన్‌గా నియమించారు. ఈనెల 21న డిప్యూటీ సీఎం పీఎ్‌సవో భాస్కర్‌శర్మ వాచ్‌మన్‌కు ఫోన్‌ చేయగా కలవలేదు. అనుమానంతో ఆయన కార్యాలయ సిబ్బందిని ఇంటికి పంపించగా రోషన్‌ కనిపించలేదు.


ఇటు ఇంటిలోపల పరిశీలించగా బెడ్రూం తలుపులు పగులగొట్టి ఉండగా.. కప్‌బోర్డులోని రూ.80 వేలు విలువ చేసే వెండి వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. దీనిపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను పరిశీలించారు. రోషన్‌మండల్‌ తన స్నేహితుడు ఉదయ్‌కుమార్‌ ఠాకూర్‌తో కలిసి చోరీ చేసి పశ్చిమ బెంగాల్‌కు పారిపోయినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అక్కడికెళ్లిన పోలీసులు.. ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో నిందితులుండగా రైల్వే పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Sep 28 , 2024 | 03:55 AM