CM Revanth Reddy: ప్రధాని మోదీని ఇంప్రెస్ చేసిన సీఎం రేవంత్
ABN , Publish Date - Jan 06 , 2024 | 08:10 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. సీఎంగా మంచి మార్కులే వచ్చాయని రాధాకృష్ణ అనడంతో ఢిల్లీలో ఇతర పార్టీల నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని సీఎం రేవంత్ సమాదానం ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. సీఎంగా మంచి మార్కులే వచ్చాయని రాధాకృష్ణ అనడంతో ఢిల్లీలో ఇతర పార్టీల నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని సీఎం రేవంత్ సమాదానం ఇచ్చారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యాయని.. వారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించాలని కోరానని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శకటాలు ఒకసారి ప్రదర్శించారని.. ఆ తర్వాత ఆ ఊసే లేదన్నారు. ఏం జరిగిందని అధికారులను ఆరా తీస్తే 3 నెలల ముందే పంపించాలని చెప్పారని తెలిపారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి అడగగా లేటర్ ఇవ్వాలని కోరారని చెప్పారు. లేఖ ఇవ్వగా తెలంగాణకు అనుమతి వచ్చిందన్నారు. కర్ణాటక రాష్ట్రం శకటాల కోసం లేఖ ఇచ్చిన వారికి అనుమతి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అనగా.. ప్రధాని మోదీని కూడా ఇంప్రెస్ చేశారని రాధాకృష్ణ కామెంట్ చేశారు.