Bandi Sanjay: బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర
ABN, Publish Date - Aug 23 , 2024 | 03:18 AM
బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం ధ్వజమెత్తారు.
అదానీ, సెబీ అంటూ మీడియాను పక్క దారి పట్టించే యత్నం: బండి సంజయ్
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం ధ్వజమెత్తారు. అదానీ, సెబీ అంటూ ఆందోళనలు చేస్తూ ప్రజలు, మీడియాను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. అదానీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. అదే అదానీకి వ్యతిరేకంగా ధర్నా చేయడం సిగ్గు చేటని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇరుపార్టీల మధ్య క్విడ్ ప్రోకోలో భాగంగానే రాజ్యసభ స్థానాన్ని బీఆర్‌ఎస్ కాంగ్రె్‌సకు వదిలేసిందని తెలిపారు. సంఖ్యాబలమున్నా బీఆర్‌ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదని, కవిత కేసు వాదించిన న్యాయవాది సింఘ్వీని కాంగ్రెస్ బరిలో నిలిపిందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదని గ్రహించి బీఆర్‌ఎ్‌సతో చేతులు కలిపిన కాంగ్రెస్ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని చెప్పారు. అందులో భాగంగానే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, మియాపూర్ భూములు, నయీం డైరీ కేసులను నీరుగార్చారని తెలిపారు.
కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్ తప్పించిందన్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాలను బీజేపీ ఎప్పటికప్పుకు బయటపెడుతుంటే ఓర్వలేక ప్రజలకు ప్రయోజనం లేని అంశాలపై ఆ పార్టీలు గొడవ చేస్తున్నాయన్నారు. ఇటీవల దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమై తెలంగాణలో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. అదానీతో బీజేపీ కుమ్కకే్ౖకందని చెబుతున్న కాంగ్రెస్ నేతలు దీనికేం సమాధానం చెబుతారని సంజయ్ ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు 420 హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని సంజయ్ చెప్పారు. రైతులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలకు క్షేత్ర స్థాయి పరిస్థితికి పొంతన లేద న్నారు. 70 శాతం మంది రైతులు రుణాలు మాఫీ కాక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. మహిళలకు నెలకు రూ. 2500, స్కూటీలు, కొత్త జంటలకు తులం బంగారం లాంటి హామీల కోసం సోదరీమణులు ఎదురుచూస్తున్నారన్నారు. నిరుద్యోగికి రూ. 4 వేల భృతి, వృద్ధులకు రూ. 4 వేల ఆసరా పెన్షన్ అందిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇంత వరకు అమలు చేయలేదని గుర్తు చేశారు. వీటన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కారు బీఆర్‌ఎ్‌సతో కుమ్మక్కైందని సంజయ్ ఆరోపించారు.
Updated Date - Aug 23 , 2024 | 03:18 AM