ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: టీటీడీ బోర్డు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:03 AM

హిందూ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు ఉండడం వల్లే అభిప్రాయ భేదాలు వస్తున్నాయని, వారిని ఇతర శాఖల్లో పంపడమే మంచిదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

  • హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగుల వల్లే భేదాభిప్రాయాలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

తిరుమల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): హిందూ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు ఉండడం వల్లే అభిప్రాయ భేదాలు వస్తున్నాయని, వారిని ఇతర శాఖల్లో పంపడమే మంచిదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డితో కలిసి బుధవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఏర్పాటైన టీటీడీ బోర్డు.. తొలి సమావేశంలోనే కొన్ని సానుకూల, అద్భుతమైన నిర్ణయాలను తీసుకుందని ప్రశంసించారు.


ఏ మతం వారైనా వారి వారి మత విశ్వాసాలున్న ప్రాంగణంలో పని చేస్తేనే బాగుంటుందని అన్నారు. స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని తిరిగి ప్రారంభించడం కూడా మంచి విషయమన్నారు. టూరిజం టికెట్ల రద్దు నిర్ణయంపై స్పందిస్తూ.. ఈ టికెట్లు దుర్వినియోగమైనట్లు తెలిసిందన్నారు. తిరుమల పర్యాటక ప్రాంతం కాదని, హిందూ దేవతలపై విశ్వాసం ఉన్న వారే రావాలని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

Updated Date - Nov 21 , 2024 | 05:03 AM