BJP: త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం!
ABN, Publish Date - Dec 30 , 2024 | 03:36 AM
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియమాకం వచ్చే నెల రెండో వారంలోగా పూర్తికానుంది. జనవరి మొద టి వారంలో జిల్లాల అధ్యక్ష పదవుల భర్తీ, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి నియమాకం జరుగుతుందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
జనవరిలో పార్టీ జిల్లా అధ్యక్షుల పదవుల భర్తీ!
సంస్థాగత ఎన్నికలపై సమీక్ష
న్యూఢిల్లీ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియమాకం వచ్చే నెల రెండో వారంలోగా పూర్తికానుంది. జనవరి మొద టి వారంలో జిల్లాల అధ్యక్ష పదవుల భర్తీ, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి నియమాకం జరుగుతుందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఆదివారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలపై సమీక్షా సమావేశం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యతన జరిగిన ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఇన్‌చార్జులు, అధ్యక్షులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు.
మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాపంగా బీజేపీ నేతలు మౌనం పాటించారు. ఈ భేటీలో పార్టీ బూత్, మండల స్థాయి కమిటీల భర్తీపై నివేదికను నడ్డాకు కిషన్ రెడ్డి ఇచ్చారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతిని పురస్కరించుకుని వచ్చే ఏడాది డిసెంబరు 25 వరకు సుపరిపాలనా సంవత్సరం, పార్లమెంటులో కేంద్రం అంబేడ్కర్‌ను కించపరిచిందన్న కాంగ్రెస్ ఆరోపణకు కౌంటర్‌గా ఏడాది పాటు సంవిధాన్ పర్వ్ జరపాలని బీజేపీ నిర్ణయించింది.
Updated Date - Dec 30 , 2024 | 03:36 AM