ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: సుష్మాస్వరాజ్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు..

ABN, Publish Date - Dec 12 , 2024 | 09:39 AM

పార్లమెంట్‌లో ఆనాడు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ లేకుంటే తెలంగాణానే రాకపోయేదని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్‌ నాయకుడు రామచంద్రరావు(Former MLC and senior BJP leader Ramachandra Rao) అన్నారు.

- బీజేపీ నాయకుడు రామచంద్రరావు

హైదరాబాద్: పార్లమెంట్‌లో ఆనాడు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ లేకుంటే తెలంగాణానే రాకపోయేదని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్‌ నాయకుడు రామచంద్రరావు(Former MLC and senior BJP leader Ramachandra Rao) అన్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు 6 అబద్ధాలు, 66 మోసాలు కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై బుధవారం రాత్రి సీతాఫల్‌మండి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మహాకాళి సికింద్రాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA Danam ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..


సోనియాగాంధీయే తెలంగాణను ఇచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు, కేసీఆర్‌(KCR) తెచ్చాడని బీఆర్‌ఎస్‌ పార్టీ చెప్పుకుంటున్నారని, ఆనాడు పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడం కోసం కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ పూర్తిమద్దతుతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యిందని తెలిపారు. రెండుసార్లు బీఆర్‌ఎస్‏కు, ఒకసారి కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇచ్చి ప్రజలు మోసపోయారని కానీ మార్పు కావాలంటే ఈసారి ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.


కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలు, 66 మోసాల పేరుతో ముంద్రించిన కర పత్రాలతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహాకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌, ప్రధానకార్యదర్శి మేకల సారంగపాణి, ఉపాధ్యక్షుడు రాచమల్ల కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రవిప్రసాద్‌గౌడ్‌, కన్వీనర్‌ కందాడి నాగేశ్వరరెడ్డి, కనకట్లహరి, ముఖ్యనాయకులు ప్రభుగుప్తా, మేకల కీర్తి, మద్దెర్ల శ్యాంసుందర్‌, రామువర్మ, శారదామల్లేష్‌, భాస్కరగిరి, కన్నాభిరామ్‌, ప్రకాశ్‌గౌడ్‌, అనిత, హన్మంతు, సీతాఫల్‌మండి డివిజన్‌ అధ్యక్షుడు అంబాల రాజేశ్వరరావు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే

ఈవార్తను కూడా చదవండి: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్‌: కవిత

ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్‌ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్‌ అవార్డు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2024 | 09:39 AM