ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: రేపు హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ

ABN, Publish Date - Dec 06 , 2024 | 03:25 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ శనివారం హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ శనివారం హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న ఈ సభకు భారీ జన సమీకరణ చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఇంచార్జి సునీల్‌ బన్సల్‌ రెండురోజుల కిందట రాజధానితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులతో సభ నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 6 అబద్ధాలు, 66 మోసాలు అన్న నినాదంతో కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించింది.


  • కాంగ్రెస్‌ అంటే కమిషన్లు, కమిటీలు: బండి సంజయ్‌

కాంగ్రెస్‌ అంటే కమిటీలు, కమిషన్లు, కాలయాపన.. అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తీవ్రంగా విమర్శించారు. ‘ధరణిపై కమిటీ, హైడ్రా, మూసీ, ఫోర్త్‌ సిటీలతో కమిషన్‌లు, రైతు భరోసాపై కాలయాపన.. అలాంటి కాంగ్రెస్‌ పాలనలో ఏడాది కాదు... ఒక్క యుగం గడచినా సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగు పడదు’ అంటూ సంజయ్‌ ఎక్స్‌ వేదికగా ఆరోపించారు.

Updated Date - Dec 06 , 2024 | 03:25 AM