ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Kavitha: సీఎం కవిత.. నినాదాలతో హోరెత్తించిన బీఆర్ఎస్ శ్రేణులు

ABN, Publish Date - Aug 28 , 2024 | 09:23 PM

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలైన తరువాత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ కామెంట్ ప్రభావమో.. మరేమో గానీ.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో కొత్త నినాదం మారుమోగింది. ఇన్నాళ్లు కేసీఆర్ తరువాత..

హైదరాబాద్, ఆగష్టు 28: ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలైన తరువాత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ కామెంట్ ప్రభావమో.. మరేమో గానీ.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో కొత్త నినాదం మారుమోగింది. ఇన్నాళ్లు కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం అన్న బీఆర్ఎస్ శ్రేణులు.. ఇప్పుడు టోన్ మార్చేశారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా సీఎం కవిత.. సీఎం కవిత అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు. ఇప్పుడిదే పెద్ద డిస్కషన్‌గా మారింది.


ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చిలో అరెస్టైన కవిత.. దాదాపు ఐదున్నర నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో.. మంగళవారం నాడు తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కవిత కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళ్లి తీహార్ జైలు వద్ద ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జైలు బయట మీడియాతో మాట్లాడిన కవిత.. ఏ తప్పు చేయకున్నా తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. సమయం వస్తుందని, వడ్డీతో సహా చెల్లిస్తానంటూ హెచ్చరించారు. ఈ కామెంట్స్.. బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఊపు వచ్చింది.


ఇటీవల ఓసారి కేటీఆర్ సైతం కవిత విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జైలుకెళ్లి వచ్చిన వారు గొప్ప గొప్ప వాళ్లు అవుతున్నారని.. కవిత కూడా అలా ఏమైనా అవుతుందేమో అని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నారో.. కవిత కామెంట్స్ ఎఫెక్టో గానీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద రచ్చ చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. సీఎం సీఎం అంటూ కవితకు జై కొట్టారు. ఇదే సమయంలో కవిత సైతం జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ గట్టిగా నినాదాలిచ్చారు.


ఇక దాదాపు 5 నెలల తరువాత ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన కవితకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కవితపై పూల వర్షం కురిపించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు కవిత. ఇక కవిత తల్లి శోభ, కేటీఆర్ భార్య శైలిమా, హరిష్ రావు సతీమణి శ్రీనిత ఇతర బంధుమిత్రులు ఆమె ఇంటికి వచ్చారు. ఆమెకు దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతం పలికారు. వీరే కాదు.. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కవిత నివాసానికి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.


Also Read:

ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ భావోద్వేగం.. కీలక వ్యాఖ్యలు

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జహీర్..

ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ భావోద్వేగం.. కీలక వ్యాఖ్యలు

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 28 , 2024 | 09:29 PM

Advertising
Advertising