ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana Formation Day: ఆవిర్భావ వేడుకలతో కాంగ్రెస్.. దశాబ్ది ఉత్సవాలతో బీఆర్ఎస్..

ABN, Publish Date - May 28 , 2024 | 05:33 PM

రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా ఓ వైపు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) సైతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్‌గా దశాబ్ది వేడుకలను జరపాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్‌(KCR) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

హైదరాబాద్: రాష్ట్ర దశాబ్ది వేడుకల(Telangana Formation Day 2024) సందర్భంగా ఓ వైపు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) సైతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్‌గా దశాబ్ది వేడుకలను జరపాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్‌(KCR) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా జూన్‌ 1, 2, 3 తేదీల్లో మూడు రోజులపాటు వేడుకలు జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 1న సాయంత్రం 7గంటలకు గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్‌ ర్యాలీ ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు నివాళి అర్పిస్తారు.


జూన్ 2న వేడుకలు తెలంగాణభవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతాయి. 3న అన్ని జిల్లాల్లోని భారాస కార్యాలయాల్లో ముగింపు వేడుకలు ఉంటాయి. పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరేస్తారు. కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, 10 సంవత్సరాలు ప్రగతిపథంలో తొలి ప్రభుత్వాన్ని నడిపామన్నారు.

దశాబ్ది ముగింపు వేడుకల్లో కార్యకర్తలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇలా ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండూ పోటాపోటీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.

Telangana Formation Day: సోనియాతో భేటీ అయిన రేవంత్

For More Telangana News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 05:39 PM

Advertising
Advertising