ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Wanaparthy: వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేత హత్య..

ABN, Publish Date - May 24 , 2024 | 04:08 AM

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బొడ్డు శ్రీధర్‌రెడ్డి (52) అనే బీఆర్‌ఎస్‌ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి తన సొంత పొలంలోని కల్లం దొడ్డి వద్ద నిద్రిస్తున్న శ్రీధర్‌రెడ్డిని దుండుగులు గొడ్డలితో నరికిచంపారు.

  • కల్లం వద్ద నిద్రిస్తుండగా నరికి చంపిన దుండగులు

  • రాజకీయ కక్షలే కారణమంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు

  • మంత్రి జూపల్లి, అనుచరుల ప్రమేయం ఉందన్న బీఆర్‌ఎస్‌

  • మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్‌

  • హత్యకు భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణం

  • పరాకాష్ఠకు చేరిన బీఆర్‌ఎస్‌ శవరాజకీయాలు: జూపల్లి

వనపర్తి క్రైం/కొల్లాపూర్‌/హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బొడ్డు శ్రీధర్‌రెడ్డి (52) అనే బీఆర్‌ఎస్‌ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి తన సొంత పొలంలోని కల్లం దొడ్డి వద్ద నిద్రిస్తున్న శ్రీధర్‌రెడ్డిని దుండుగులు గొడ్డలితో నరికిచంపారు. ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, బీఆర్‌ఎస్‌ నేతలు మృతదేహంతో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం.. శ్రీధర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో కీలక నాయకుడిగా, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. కాగా, కల్లం వద్ద మిర్చి నిల్వలు ఉండటంతో కొద్దిరోజులుగా ఆయన అక్కడే నిద్రిస్తున్నారు.


బుధవారం రాత్రి కూడా అక్కడే నిద్రించారు. అయితే.. గురువారం ఉదయం కల్లం వద్దకు పాలు పితకడానికి వెళ్లిన శ్రీధర్‌రెడ్డి తండ్రి శేఖర్‌రెడ్డి.. తన కుమారుడు హత్యకు గురై విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే గ్రామస్థుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. డాగ్‌స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాలను తనిఖీ చేయగా, ఒక పాయింట్‌ వద్దకు వెళ్లి డాగ్‌స్క్వాడ్‌ తిరిగి వచ్చింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన కుమారుడిపై హత్యకు కుట్ర చేశారని మృతుడి తండ్రి శేఖర్‌రెడ్డి ఆరోపించారు. పలుమార్లు తనకు మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కృష్ణప్రసాద్‌ల నుంచి ప్రాణహాని ఉందని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వనపర్తి సీఐ నాగభూషణ్‌రావు తెలిపారు.


జూపల్లి బాధ్యత వహించాలి: కేటీఆర్‌

శ్రీధర్‌రెడ్డి హత్య విషయం తెలుసుకొని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గ్రామానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం, స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ హత్యకు బాధ్యత వహించాలన్నారు. జూపల్లిని బర్తర ఫ్‌ చేసి జ్యుడీషియల్‌ లేదా ఎస్‌ఐబీ ద్వారా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలోని లేని ఫ్యాక్షన్‌ సంస్కృతిని కొల్లాపూర్‌లో జూపల్లి అమల్లోకి తెచ్చారని, 4 నెలల్లో ఇద్దరు బీఆర్‌ఎస్‌ నాయకులు హత్యకు గురయ్యారని అన్నారు. మంత్రిని బర్తరఫ్‌ చేసి సీఎం రేవంత్‌ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.


భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీల వల్లే..

బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. శ్రీధర్‌రెడ్డి హత్యకు దురలవాట్లు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యను రాజకీయ హత్యగా కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు చిత్రీకరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోకుండానే తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌ నీచరాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని, ఇకనైనా శవరాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. శ్రీధర్‌ రెడ్డి హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని, విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

Updated Date - May 24 , 2024 | 04:08 AM

Advertising
Advertising