ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: రైతుల పోరుబాటతో కాంగ్రెస్ వెన్నులో వణుకు.. అధికార పార్టీపై నిప్పులు చెరిగిన హరీశ్

ABN, Publish Date - Sep 19 , 2024 | 03:04 PM

హామీలు అమలు చేయకుండ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అధికార పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శిస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో హరీశ్ ఓ పోస్ట్ చేశారు.

హైదరాబాద్: హామీలు అమలు చేయకుండ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అధికార పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శిస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో హరీశ్ ఓ పోస్ట్ చేశారు. "రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజాభవన్‏కు పిలుపునిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకుపుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులను, రైతు సంఘాల నాయకులను ఎక్కడిక్కడ పోలీసు స్టేషన్లలో నిర్బంధిస్తూ వారిపై కక్ష తీర్చుకుంటోంది.

రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన రైతన్నలను అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య. బీఆర్ఎస్ పార్టీ పక్షాన దీనిని తీవ్రంగాఖండిస్తున్నాం. అరెస్టులు చేసిన రైతులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మాది ఆంక్షలు లేని ప్రభుత్వం, కంచెలు లేని ప్రభుత్వం, ప్రజా పాలన అంటూ డబ్బా కొట్టుకునే రేవంత్ రెడ్డి ఇదేంటి? ప్రజా భవన్ చుట్టూ ఎందుకు ఇన్ని బారికేడ్లు, ఎందుకు ఇన్ని ఆంక్షలు? ప్రజాభవన్ కు రైతులు తరలివస్తున్నారంటే సీఎంకు ఎందుకు అంత భయం? రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా మొదలైన రైతుల ఉద్యమాన్ని ఎదుర్కోవడం అంటే.. రాజకీయంగా వెకిలి మకిలి, చిల్లర వ్యాఖ్యలు చేసినంత సులువు కాదు.


రుణమాఫీ ఏమైందని నిలదీసేందుకు వస్తున్న రైతులకు ఏమని సమాధానం చెబుతావు? రేవంత్ రెడ్డి.. రైతులందరికి 2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, మాట తప్పావు. ఇప్పుడది నీకు, నీ ప్రభుత్వానికి ఉరితాడు కాబోతున్నది. రుణమాఫీ చేసి తీరేదాకా, నిన్ను బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు, తెలంగాణ రైతాంగం వదిలిపెట్టదు. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. చరిత్రలో ఏనాడూ బాగుపడలేదు" అని హరీశ్ విమర్శించారు. ఈ పోస్ట్ ను @TelanganaCMO కు ట్యాగ్ చేశారు.

For Latest News and National News click here

Updated Date - Sep 19 , 2024 | 03:06 PM

Advertising
Advertising