ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: మంత్రి సీతక్కకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..

ABN, Publish Date - Aug 19 , 2024 | 03:44 PM

తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. మొన్నటి వరకూ రుణమాఫీ, ఇప్పుడేమో మహిళల అఘాయిత్యాలపై ఇలా రోజుకో టాపిక్‌పై నేతలు మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నారు. తాజాగా.. మంత్రి సీతక్కకు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ (Congress Vs BRS) నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. మొన్నటి వరకూ రుణమాఫీ, ఇప్పుడేమో మహిళల అఘాయిత్యాలపై ఇలా రోజుకో టాపిక్‌పై నేతలు మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నారు. తాజాగా.. మంత్రి సీతక్కకు (Minister Seethakka) మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (KTR) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీతక్కకు ఎనిమిది నెలల తర్వాత అయినా మహిళలపై అఘాయిత్యాలు గుర్తుకు రావడం మంచిదని సెటైరికల్‌గా మాట్లాడారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ప్రభుత్వం, మహిళా కమీషన్ వెంటనే స్పందించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన పడినట్లుగా ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


అవును.. అంతా మేమే!

చెంచు మహిళపై అఘాయిత్యం జరిగితే మా నాయకులు వెళ్లే వరకూ పట్టించుకున్న వారు లేరు. షాద్ నగర్‌లో ఒక దళిత మహిళపై అఘాయిత్యం జరిగితే మా నాయకులు వెళ్ళే వరకు పట్టించుకోలేదు. మేము గొడవ చేస్తే పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. మహిళలు, పిల్లలు, ప్రజలు శాంతియుతంగా బ్రతికే విధంగా మహిళా కమీషన్, ప్రభుత్వం చూసుకోవాలి. హైదరాబాద్ నగరంలో మర్డర్లు జరుగుతుంటే ఆపే తెలివి లేదు. అఘాయిత్యాలు పెరుగుతుంటే పట్టించుకునే నాధుడు లేడు.రాష్ట్రానికి హోంమంత్రి దిక్కు లేడు. నేను పొరపాటున నోరుజారి ఒక మాట అంటే క్షమాపణ చెప్పాను. ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సమస్య లేనట్లు దాన్నే సమస్య చేస్తున్నారు. దానికి రాజకీయ రంగు పులుముతున్నారు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఘాయిత్యాలపై విచారణ జరపండి. అప్పుడు శాంతి భద్రతలు ఎలా ఉండనో ఎప్పుడు ఎలా ఉన్నాయో కమిషన్ వేయండి. షీ టీమ్స్ పెట్టింది ఎవరు..?. భరోసా కేంద్రాలు పెట్టింది ఎవరు..?. ఉమెన్స్ సేఫ్టీ వింగ్ స్టార్ట్ చేసింది ఎవరు..? దిశలాంటి ఘటనలో తెలంగాణ లాంటి న్యాయం చేయాలని కోల్‌కతా ఘటనలో కోరుతున్నారు. దట్ ఈజ్ కేసిఆర్, మీకు మాట్లాడే అర్హత ఉందా?. హత్యలు జరుగుతుంటే పట్టించుకునే నాథుడు లేడు. మీరు మాట్లాడతారా? అని సీతక్కతో పాటు ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.


ఇంతకీ సీతక్క ఏమన్నారు..?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగిపోయాయంటూ బీఆర్ఎస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తొమ్మిదేండ్ల కాలంలో మొత్తం 1,57,610 కేసులు నమోదు అయ్యాయని లెక్కలు తీసి మరీ చెప్పారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో ఈ గణాంకాలను వెల్లడించిందని, ఇవన్నీ మహిళలపై జరిగిన నేరాలను పోలీసులు కేసులుగా నమోదు చేసినవేనని అన్నారు. మహిళా కమిషన్‌ను తాము కూడా కలుస్తామని.. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన నేరాలు వివరాలన్నింటినీ సమర్పిస్తామని సీతక్క అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఒకరోజు ఆలస్యంగా స్పందించిన కేటీఆర్ పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.

Updated Date - Aug 19 , 2024 | 03:50 PM

Advertising
Advertising
<