BRS MP Candidates: బీఆర్ఎస్ అభ్యర్థుల మొత్తం లిస్ట్ వచ్చేసింది..
ABN, Publish Date - Mar 25 , 2024 | 12:59 PM
బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల లిస్ట్ మొత్తం వచ్చేసింది. తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను ఇప్పటికే పలువురు అభ్యర్థులను పార్టీలు ప్రకటించాయి.
హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) లోక్‌సభ అభ్యర్థుల లిస్ట్ మొత్తం వచ్చేసింది. తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు (Telangana LokSabha Polls) సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను ఇప్పటికే పలువురు అభ్యర్థులను పార్టీలు ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్ .. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రాష్ట్ర ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. నేడు మొత్తం లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఫైనల్ లిస్ట్‌ను విడుదల చేసింది. అభ్యర్థుల విషయానికి వస్తే 17 మందిలో ఓసి.. 06, బీసీ.. 06, ఎస్సీ.. 03, ఎస్టీలు ఇద్దరు ఉన్నారు. మొత్తంగా ఓసీ, బీసీలకు అధిక సంఖ్యలో సీట్లను కేటాయించారు.
AP Elections: రఘురామను కాదని శ్రీనివాసవర్మకు టికెట్.. ఇంతకీ ఎవరీయన..!?
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా..
1). ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు (ఓసీ)
2). మహబూబాబాద్ (ఎస్టీ) - మాలోత్ కవిత
3). కరీంనగర్ - బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
4).పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5). మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
6). చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
7). వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8). నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)
9). జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)
10). ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ( ఆదివాసీ)
11). మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
12). మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి (ఓసీ)
13). నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14). సికింద్రాబాద్ - తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)
15). భువనగిరి - క్యామ మల్లేశ్ (బీసీ)
16). నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
17). హైదరాబాద్ - గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)
AP Elections: చిత్తయినా..అదే ఎత్తు..!
ఒక్కరంటే ఒక్కరూ..!
కాగా.. ఈ అభ్యర్థుల్లో అందరూ ఊహించని వారే. వాస్తవానికి మల్కాజిగిరితో పాటు మిగిలిన మూడు స్థానాలకు టికెట్ తమకే కావాలంటూ చాలా మందే బీఆర్ఎస్ మంతనాలు జరిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాలని విశ్వప్రయత్నాలే చేశారు. సీన్ కట్ చేస్తే.. టికెట్ రాకపోగా ఊహించని వ్యక్తికి టికెట్ దక్కింది. ఇక చేవెళ్ల విషయంలోనూ అంతే.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన కాసానికి టికెట్ దక్కింది. ఇక్కడ్నుంచి సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇస్తారని నిన్న, మొన్నటి వరకూ ప్రచారం జరిగింది. ఇక మెదక్ నుంచి అయితే.. చాలా పేర్లే తెరపైకి వచ్చినప్పటికీ సీనియర్ నేత వెంకట్రామీరెడ్డిని టికెట్ వరించింది. ఇక అనిల్ కుమార్ కూడా అంతే. మొత్తానికి చూస్తే.. ఈ నలుగురు అభ్యర్థులూ ఊహించని వారే.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 25 , 2024 | 02:48 PM