ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన హరీశ్ రావు

ABN, Publish Date - Nov 18 , 2024 | 04:55 PM

ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న వారిపై చర్యలకు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ కొణతం దిలీప్‌ను సోమవారం హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్, నవంబర్ 18: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ కొణతం దిలీప్‌ను సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా హెడ్‌గా కొణతం దిలీప్ వ్యవహారించారు.

Also Read: బీజేపీ అంటే ఏంటో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తాం


అయితే గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో కొణతం దిలీప్.. ఆ పదవి నుంచి తప్పుకున్నారు. నాటి నుంచి రేవంత్ సర్కారే లక్ష్యంగా ఆయన సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా రంగంలోకి దిగడంతోపాటు లగచర్ల ఘటనలపై సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరిగింది.

Also Read: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి


దీనిని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఆ క్రమంలో చర్యలు చేపట్టింది. ఇలాంటి పోస్టులు పెట్టిన.. పెడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కొణతం దిలీప్ సోషల్ మీడియా హెడ్‌గా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.

Also Read: నిమ్మకాయలతో ఇన్ని లాభాలున్నాయా..?


మరోవైపు కొణతం దిలీప్ అరెస్ట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. కొణతం దిలీప్ అరెస్ట్‌ను ఆయన ఖండించారు. కక్షపూరిత, ప్రతీకార చర్యలు మానుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన హితవు పలికారు. ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ.. అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.


ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హరీశ్ రావు స్పందించారు.

For Telangana news And Telugu News

Updated Date - Nov 18 , 2024 | 04:55 PM