ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: 11న బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కేసీఆర్‌ భేటీ

ABN, Publish Date - Sep 05 , 2024 | 04:39 AM

రైతుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని భావిస్తోంది.

  • ప్రజల్లోకి వెళ్లడంపై వ్యూహ రచన

హైదరాబాద్‌, సెప్టెంబరు4 (ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెట్టేలా కార్యాచరణ అమలు చేసేందుకు గులాబీ బాస్‌ వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ ఈనెల 11న తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. రైతుల సమస్యలు, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయడంలో విఫలమవ్వడం తదితర అంశాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకువెళ్లాలన్న దానిపై ఆయన చర్చించనున్నట్లు తెలిసింది.


బీఆర్‌ఎస్‌ తరఫున క్షేత్రస్థాయిలో తరచూ కార్యక్రమాలు చేపట్టడం, ప్రజా సమస్యలపై గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు పోరాటం చేయడంపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాఆరం. సాగునీరు, విద్యుత్తు కష్టాలతోపాటు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా కేసీఆర్‌ నిరసనలు, రోడ్‌షోలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా, గ్రామ, మండల స్థాయిలో కమిటీల ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత ఒకరు అభిప్రాయపడ్డారు. పార్టీ సభ్యత్వాలను ప్రతి నాలుగేళ్లకు ఒకసారి చేయాల్సి ఉంటుందని, ఇప్పటికే చేపట్టిన సభ్యత్వాల నమోదు ప్రక్రియ పూర్తయి మూడేళ్లయిందని, దీంతో మరో ఏడాదికి సభ్యత్వ నమోదు చేపడతామన్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. గ్రామ, మండల కమిటీలను నియమించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 04:39 AM

Advertising
Advertising