ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BIG DEBATE: కేసీఆర్ ‘ఆ విషయాన్ని’ పసిగట్టాడు: రేవంత్ రెడ్డి రెడ్డి

ABN, Publish Date - May 07 , 2024 | 08:48 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇటీవల గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ కొద్దిగా పుంజుకొంది. అయితే ఇది బీజేపీకి నష్టం జరుగుతుందనే ఓ వాదన ఉంది. అందుకు అవకాశం ఉందా? అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇటీవల గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ కొద్దిగా పుంజుకొంది. అయితే ఇది బీజేపీకి నష్టం జరుగుతుందనే ఓ వాదన ఉంది. అందుకు అవకాశం ఉందా? అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటర్లు మారే అవకాశం లేదన్నారు. అయితే సోషల్ ఈక్వేషన్స్‌తో కాంగ్రెస్ పార్టీకి ఓ సెటాఫ్ ఓటు ఉందని తెలిపారు. మిగిలిన దానిలో అటు బీజేపీకా? ఇటు బీఆర్ఎస్‌కా? అనేది నిర్ణయం జరగాలని అభిప్రాయపడ్డారు. ఆ క్రమంలో బీఆర్ఎస్‌ పార్టీ సైలెంట్‌గా ఉంటే.. ఆ ఓటంతా కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

LokSabha Elections: అధికారం కోసం మోదీ అండ్ కో ఎంతకైనా..

ఆ క్రమంలో కేసీఆర్ ప్రచారానికి దిగారన్నారు. అదీకాక.. ఈ లోక్‌సభ ఎన్నికలు అయిన వెంటనే.. స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులంతా మళ్లీ ప్రచారంలోకి దిగుతున్నారన్నారు. అలా కాకుంటే.. ఆ ఓట్ బ్యాంక్ అంతా.. మరో పార్టీకి మళ్లే అవకాశాలున్నాయని వివరించారు.


ఇక ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీకి అయినా గ్రామస్థాయిలో.. మండల స్థాయిలో ఓట్లే అత్యంత కీలకమన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో మా పార్టీ వాళ్లు.. రేపు స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచి.. నిధులు తేస్తామంటూ ప్రచారం చేస్తే.. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడే అవకాశం ఉందన్నారు.

West Bengal: నియామకాల రద్దుపై స్టే.. కానీ సీబీఐ విచారణ జరపండి

ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పసిగట్టారని రేవంత్ చెప్పారు. అందుకే కేసీఆర్‌కు ఆరోగ్యం సహకరించకున్నా.. ఆయన ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగారన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హయాంలో అన్ని పార్టీలను నామా రూపాలు లేకుండా చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని.. అయితే అదే పరిస్థితి ప్రస్తుతం ఆయనకు ఎదురయ్యేలా ఉందన్నారు. అందుకే కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి రావడం వల్ల ఆ పార్టీకి కొద్దిగా పుంజుకొందని రేవంత్ రెడ్డి వివరించారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన అప్పులకు రూ. 30 వేల కోట్లు వడ్డి తాను కట్టానని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 07 , 2024 | 08:48 PM

Advertising
Advertising