ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: రేవంత్ ఉడుత ఊపులకు అదర బెదర

ABN, Publish Date - Nov 07 , 2024 | 03:46 PM

జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తనను జైల్లో పెట్టి సీఎం రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందుతానంటే అందుకు రెడీగా ఉన్నానని ఆయన తెలిపారు. రెండు మూడు నెలల్లో జైల్లో ఉంటే ఏమవుతుందని ఈ సందర్బంగా కేటీఆర్ ప్రశ్నించారు. మంచిగా యోగా చేసుకుని బయటకు వస్తానన్నారు.

హైదరాబాద్, నవంబర్ 07: బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా వన్ రేసింగ్ వ్యవహారంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నాటి ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఉచ్చు బిగుస్తుందంటూ ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తుంది.

జైలుకు వెళ్లడానికి సిద్దం..

అలాంటి వేళ గురువారం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేల మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. తాను జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తనను జైల్లో పెట్టి సీఎం రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందుతానంటే అందుకు రెడీగా ఉన్నానని ఆయన తెలిపారు. రెండు మూడు నెలల్లో జైల్లో ఉంటే ఏమవుతుందని ఈ సందర్బంగా కేటీఆర్ ప్రశ్నించారు. మంచిగా యోగా చేసుకుని బయటకు వస్తానన్నారు.

Also Read: MallaReddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు


న్యూస్ పేపర్ల నోటీసులే వచ్చాయి..

అనంతరం తాను పాదయాత్ర చేసేందుకు సిద్దమవుతానని పేర్కొన్నారు. అయితే టార్గెట్ కేటీఆర్‌పై కాదు.. ప్రజా సమస్యలపై పెట్టాలంటూ పరోక్షంగా ఆంధ్రజ్యోతి వార్తను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్రావించారు. ఏసీబీ నుంచి తనకు ఎలాంటి నోటీసు రాలేదన్నారు. తనకు న్యూస్ పేపర్ల నోటీసులే వస్తున్నాయని వ్యంగ్యంగా పేర్కొన్నారు. సీఎం రేవంత్ ఉడుత ఊపులకు భయపడేది లేదని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్‌ పార్టీని ఖతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. తనపై విచారణకు గవర్నర్ అనుమతి ఇస్తే.. ఆయన విచక్షణకు వదిలేస్తానన్నారు. రాజ్ భవన్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ బయట పడిందని మండిపడ్డారు.


అప్పుడు చంద్రబాబు చొరవ..

2003లో భారత్‌లో ఫార్ములా వన్ రేసింగ్ నిర్వహించాలని నాటి ఏపీ సీఎం చంద్రబాబు ఆశించారన్నారు. దేశంలో ఫార్ములా వన్ రేసింగ్ నిర్వహించేందుకు ఆయన చొరవ తీసుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఫార్ములా వన్ రేసింగ్‌కి అనేక దేశాలు సైతం పోటీ పడ్డతాయని కేటీఆర్ వివరించారు. ఫార్ములా వన్ రేసింగ్ దేశంలో తొలిసారి 1946లో జరిగిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.


కామన్వెల్త్ క్రీడలంటే..

ఫార్ములా వన్ రేసింగ్‌కి అనేక దేశాలు సైతం పోటీ పడ్డతాయని కేటీఆర్ వివరించారు. ఫార్ములా వన్ రేసింగ్ దేశంలో తొలిసారి 1946లో జరిగిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కామన్వెల్త్ క్రీడలంటే.. కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణం గుర్తుకు వస్తుందన్నారు. కామన్వెల్త్ క్రీడల కోసం ఒరిజినల్ కాస్ట్ కంటే 100 రెట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ప్రభుత్వాలు ఖర్చు చేయడం సర్వ సాధారణమేనన్నారు. 1984లో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు జరిగాయన్నారు.


ఐఏఎస్ అర్వింద్ కుమార్‌కు నోటీసులు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో నిబంధనలకు నీళ్లు వదిలారంటూ.. ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ జరపాలంటూ.. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాశారు. అందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏసీబీ జేడీ స్థాయి అధికారితో ఈ వ్యవహారాన్ని తిరుగతోడుతుందీ రేవంత్ సర్కార్. అందులో భాగంగా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది.


ఇక ఈ కారు రేస్ అంశంలో విదేశీ సంస్థకు నిధులు బదిలీ అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. దాంతో దీనిని ఈడీ దృష్టికి ప్రభుత్వం తీసుకు వెళ్లింది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయడంతో.. ఈడీ సైతం విచారణ చేపట్టే అవకాశముందని తెలుస్తుంది.

For Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 04:41 PM