ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BSP Agitation: దేశ వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించిన బీఎస్పీ..

ABN, Publish Date - Dec 24 , 2024 | 09:57 PM

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై పార్లమెంట్‌ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ..

BSP protests

హైదరాబాద్, డిసెంబర్ 24: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై పార్లమెంట్‌ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ బీఎస్పీ అధినేత్ర మాయావతి ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా బీఎస్‌పీ నేతలు.. అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ.. అమిత్ షాను హోంమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వెంటనే అంబేద్కర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అమిత్‌ షాకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు బీఎస్పీ నేతలు వినతి పత్రాలు అందజేశారు. కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి ఈ వినతి పత్రాలు పంపించారు.


హస్తినాలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు..

బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్ నేతృత్వంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆకాష్ ఆనంద్.. ‘అంబేద్కర్ మాకు దేవుడు. దేవుడి కంటే కూడా ఎక్కువే. అంబేద్కర్ విలువ హక్కులు కోల్పోయిన ప్రజలకు తెలుస్తుంది. ఇవాళ మేము ఎవరినీ తిట్టడానికి ఇక్కడికి రాలేదు. బహుజన సమాజం ఐక్యత కోసం వచ్చాము. బహుజనులు ఐక్యంగా లేకపోతే ఏం జరుగుందో చూస్తూనే ఉన్నాం. పార్టీ అధినేత్రి మాయావతి ఆదేశాలకు అనుగుణంగా బహుజన సమాజాన్ని బలోపేతం చేయడానికి వచ్చాం’ అని ఆకాష్ ఆనంద్ అన్నారు.


సోషల్ మీడియాలో దుమ్మురేషిన ‘అంబేద్కర్’..

ఇకపోతే సోషల్ మీడియాలో ‘అంబేద్కర్ మా దేవుడు’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. మరోవైపు ఇదే నినాదంతో బీఎస్పీ నిరసనలు హోరెత్తాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో బీఎస్పీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక మహారాష్ట్రలో బీఎస్పీ నేతలు తమ నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ నీలిమయమయ్యాయి.


తెలుగు రాష్ట్రాల్లోనూ..

తెలుగు రాష్ట్రాల్లోనూ బీఎస్పీ నేతలు తమ నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో పార్టీ శ్రేణులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమిత్ షాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన బీఎస్పీ నేతలు.. జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో హైరదాబాద్‌లోని బడంగ్‌పేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ, అమిత్‌ షాలపై ద్వజమెత్తారు బీఎస్పీ నేతలు. ఇక ఏపీ సైతం నీలి దళం నిరసనలతో దద్దరిల్లింది. పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, అధ్యక్షుడు పరంజ్యోతి, అధికార ప్రతినిధి వందన్ కుమార్, ఉపాధ్యక్షుడు గౌతమ్ కుమార్ల నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అమిత్ షాను బర్తరఫ్ చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి వినతి పత్రాలు పంపారు.

Updated Date - Dec 24 , 2024 | 09:57 PM