ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Burra Venkatesham: జేఎన్‌టీయూ అఫిలియేషన్‌ కోసం ఎవరికీ డబ్బులివ్వొద్దు.!

ABN, Publish Date - Jun 30 , 2024 | 03:50 AM

జేఎన్‌టీయూ నుంచి అఫిలియేషన్‌ కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ప్రైవేటు ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలకు ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ బుర్రా వెంకటేశం సూచించారు.

  • ఎవరైనా అడిగితే నాకు ఫోన్‌ చేయండి: బుర్రా వెంకటేశం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ నుంచి అఫిలియేషన్‌ కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ప్రైవేటు ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలకు ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ బుర్రా వెంకటేశం సూచించారు. తాము అఫిలియేషన్‌ ఇప్పించామంటూ ఎవరైనా డబ్బు అడిగితే నేరుగా తనకే ఫోన్‌ చేయాలన్నారు. శనివారం ఆయా కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం అఫిలియేషన్‌కు దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో ప్రిన్సిపాల్స్‌, ఫ్యాకల్టీ కొరత ఉన్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, అయినప్పటికీ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి అఫిలియేషన్ల విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.


పట్టణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీఎ్‌సఈ కోర్సు సీట్లను పెంచుకుంటూ పోతే గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాకల్టీ దొరకని పరిస్థితి ఏర్పడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఇన్‌చార్జ్‌ వీసీ పేర్కొన్నారు. సమావేశంలో రెక్టార్‌ విజయకుమార్‌ రెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు రవీంద్రారెడ్డి, తారాకళ్యాణి, ప్రైవేటు ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలకు అఫిలియేషన్లు ఇవ్వడం, ఆయా కళాశాలల్లో బోధనా సిబ్బందిని ర్యాటిఫై చేయడం.. తదితర అంశాల్లో గత ఐదేళ్లుగా జరిగిన అవతవకలపై విచారణ చేపట్టాలని జేఎన్‌టీయూ ఇన్‌చార్జ్‌ వీసీ బుర్రా వెంకటేశం శనివారం రిజిస్ర్టార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jun 30 , 2024 | 03:50 AM

Advertising
Advertising