Dileep Konatham: తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్‌పై కేసు
ABN, Publish Date - May 24 , 2024 | 03:35 AM
టీజీఎ్‌సఆర్టీసీ నకిలీ లోగో వివాదంలో తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా విభాగం మాజీ డైరెక్టర్ కొణతం దిలీ్‌పపై కేసు నమోదైంది. ఆర్టీసీ నకిలీ లోగోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై కొణతం దిలీ్‌పతోపాటు హరీశ్ రెడ్డి అనే మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కొణతం దిలీప్‌తోపాటు మరొకరిపై కూడా
టీజీఎస్‌ఆర్టీసీ నకిలీ లోగో వివాదం
సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఆరోపణ
ఆర్టీసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
టీజీఎ్‌సఆర్టీసీ నకిలీ లోగో వివాదం..
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): టీజీఎ్‌సఆర్టీసీ నకిలీ లోగో వివాదంలో తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా విభాగం మాజీ డైరెక్టర్ కొణతం దిలీ్‌పపై కేసు నమోదైంది. ఆర్టీసీ నకిలీ లోగోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై కొణతం దిలీ్‌పతోపాటు హరీశ్ రెడ్డి అనే మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ ఐటీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. టీజీఎస్ ఆర్టీసీ అధికారులు గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కొణతం దిలీప్, హరీశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. నకిలీ లోగో సృష్టించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసభ్యపదజాలంతో వీడియోను రూపొందించి ఎక్స్(ట్విటర్)లో పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన పోలీసులు కొణతం దిలీప్, హరీశ్ రెడ్డిపై ఐపీసీ 469, 504, 505 (1)(బి)(సి)లతో పాటు ఐటీ యాక్ట్ 67 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - May 24 , 2024 | 03:35 AM