ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CCI: మద్యం అమ్మకాల్లో బహుమతుల ఎర

ABN, Publish Date - Dec 21 , 2024 | 04:37 AM

మద్యం అమ్మకాలు పెంచుకోవడం కోసం కొన్ని అంతర్జాతీయ కంపెనీలు అనుసరిస్తున్న అనైతిక వ్యాపారంపై ఫిర్యాదులు రావడంతో కాంపిటీషన్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) రంగంలోకి దిగింది.

  • రిటైలర్లతో కుమ్మక్కైన అంతర్జాతీయ కంపెనీలు

  • ఆ కంపెనీల విస్కీ అమ్మకాల కోసం ఒత్తిడి

  • రంగంలోకి దిగిన సీసీఐ.. హైదరాబాద్‌లో పలుచోట్ల సోదాలు

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : మద్యం అమ్మకాలు పెంచుకోవడం కోసం కొన్ని అంతర్జాతీయ కంపెనీలు అనుసరిస్తున్న అనైతిక వ్యాపారంపై ఫిర్యాదులు రావడంతో కాంపిటీషన్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) రంగంలోకి దిగింది. అంతర్జాతీయ మద్యం కంపెనీలు అయిన ఫెర్నాడ్‌ రికర్డ్‌(షివాస్‌ రీగల్‌), ఏబీ బివరేజే్‌స(బడ్వ్‌జర్‌ బీర్‌)లకు చెందిన హైదరాబాద్‌ కార్యాలయాల్లో, కొందరు రిటైల్‌ మద్యం వ్యాపారుల కార్యాలయాల్లో సీసీఐ బృందం సోదాలు నిర్వహించింది.


ఇతర బ్రాండ్‌ల మద్యం అమ్మకుండా తమ కంపెనీలకు చెందిన మద్యం మాత్రమే అమ్మే విధంగా ఈ రెండు కంపెనీలు రిటైలర్లకు పలు రకాల బహుమతులు, స్కీములు ఇస్తున్నట్లు సీసీఐ తనిఖీల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. రిటైల్‌ వ్యాపారులు కూడా షివాస్‌ రీగల్‌ కొనుగోళ్లను ప్రోత్సహించడానికి తమ వినియోగదారులకు బహుమతులు ఇస్తున్నారా..? అనే కోణంలోనూ సీసీఐ అధికారులు విచారణ నిర్వహించినట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 21 , 2024 | 04:37 AM