Share News

Hyderabad: టీఎస్‌ స్థానంలో టీజీ

ABN , Publish Date - May 18 , 2024 | 04:59 AM

ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర అబ్రివియేషన్‌ను సూచించే ‘టీఎస్‌’ స్థానంలో ‘టీజీ’ని వినియోగించేందుకు కేంద్రం అనుమతి లభించింది. గత మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అనుమతులు రాగా.. తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీఎ్‌సకు బదులుగా టీజీని వినియోగించేందుకు ఓకే చెప్పింది.

Hyderabad: టీఎస్‌ స్థానంలో టీజీ

  • పీఎ్‌సయూలు, ప్రభుత్వ సంస్థలు,

  • ఏజెన్సీలు.. ‘పేర్లు’ మార్చుకోవాల్సిందే

  • 8అధికారులకు సీఎస్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర అబ్రివియేషన్‌ను సూచించే ‘టీఎస్‌’ స్థానంలో ‘టీజీ’ని వినియోగించేందుకు కేంద్రం అనుమతి లభించింది. గత మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అనుమతులు రాగా.. తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీఎ్‌సకు బదులుగా టీజీని వినియోగించేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, పీఎ్‌సయూలు, ఏజెన్సీల పేర్ల ముందు ‘టీఎ్‌స’కు బదులు ‘టీజీ’ చేరనుంది. ఉదాహరణకు టీఎ్‌సపీసీఎస్సీ పేరు టీజీపీఎస్సీగా, టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ పేరు టీజీఎస్పీడీసీఎల్‌గా, టీఎ్‌సఎన్పీడీసీఎల్‌ పేరు టీజీఎన్పీడీసీఎల్‌గా, టీఎ్‌సఆర్టీసీ పేరు టీజీఆర్టీసీగా మారిపోనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల నుంచి స్టేషనరీ మెటీరియల్‌ దాకా అన్ని చోట్ల ‘టీజీ’నే ముద్రించనున్నారు.


ఈ మేరకు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఎండీలకు ఆదేశాలు జారీ చేస్తూ సీఎస్‌ శాంతికుమారి శుక్రవారం ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ సంస్థలన్నీ ఇకపై వాటి పేర్లను ‘టీజీ’తో ప్రారంభమయ్యేలా మార్చుకోవాలని సూచించారు. లెటర్‌హెడ్‌లు, రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు, పాలసీ పేపర్లు, జీవోలు, ఇతర అధికారిక కమ్యూనికేషన్లన్నింటిపై టీఎస్‌ స్థానంలో టీజీని పొందుపర్చుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిర్వహించే అంతర్గత, బాహ్య ఉత్తర ప్రత్యుత్తరాలతోపాటు స్టేషనరీ మెటీరియల్‌పైనా టీఎ్‌సకు బదులుగా టీజీని ముద్రించాలని సూచించారు. ఈ మేరకు తీసుకున్న చర్యలపై ఈ నెల 31లోపు నివేదిక పంపాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు.

Updated Date - May 18 , 2024 | 05:50 AM