Medaram: ఆదివాసీల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం.. ఏం చేసిందంటే..?
ABN, Publish Date - Feb 22 , 2024 | 03:25 PM
ఆదివాసీల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. సమ్మక్క సారాలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించలేమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తరఫున సమ్మక్క సారలమ్మకు గురువారం నాడు కిషన్ రెడ్డి మొక్కులు చెల్లించారు.
మేడారం: ఆదివాసీల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. సమ్మక్క సారమ్మ (Sammakka Saramma) జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఆదివాసీలు గత కొంతకాల నుంచి కోరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి ఇదే అంశంపై విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించలేమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan Reddy) స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తరఫున సమ్మక్క సారమ్మకు గురువారం నాడు కిషన్ రెడ్డి మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో కిషన్ రెడ్డి మాట్లాడారు.
Seethakka: తల్లులకు ఘనస్వాగతం పలుతాం... ఘనంగా సాగనంపుతాం
కిషన్ రెడ్డి ఏమన్నారంటే
సమ్మక్క సారమ్మ పండుగను జాతీయ పండగగా గుర్తించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. జాతీయ పండగగా గుర్తించే సిస్థం దేశంలో మరే చోట లేదని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా ఈ సారి కూడా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి వివరించారు. జాతర కోసం రూ.3.14 కోట్ల నిధులు అందజేశామని వివరించారు. సమ్మక్క సారమ్మ పేరుతో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. గిరిజన వర్సిటీలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రధాని మోదీ చెప్పారని కిషన్ రెడ్డి వెల్లడించారు.
మేడారంకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 22 , 2024 | 03:28 PM