TG News: పార్లమెంట్ ఎన్నికలపై సీఈఓ వికాస్‌రాజ్ కీలక సూచనలు
ABN, Publish Date - Mar 18 , 2024 | 06:44 PM
పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై సీఈఓ వికాస్‌రాజ్(CEO Vikasraj) కీలక సూచనలు జారీ చేశారు. సోమవారం నాడు తెలంగాణ బీఆర్కే భవన్‌లో సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ... 3కోట్ల 30లక్షల మంది ఓటర్లు ఉంటే....8 లక్షల మంది కొత్త యువ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ సారి 85 ఏళ్ల పైబడిన వాళ్లకు హోం ఓటింగ్ అవకాశం కల్పించినట్లు చెప్పారు.
హైదరాబాద్: పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై సీఈఓ వికాస్‌రాజ్(CEO Vikasraj) కీలక సూచనలు జారీ చేశారు. సోమవారం నాడు తెలంగాణ బీఆర్కే భవన్‌లో సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ... 3కోట్ల 30లక్షల మంది ఓటర్లు ఉంటే....8 లక్షల మంది కొత్త యువ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ సారి 85 ఏళ్ల పైబడిన వాళ్లకు హోం ఓటింగ్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. నామినేషన్ ఉపసంహరణ తర్వాత రోజు నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. పోస్టల్ ఓటింగ్ కొత్త సాప్ట్ వేర్ ద్వారా ఈసారి నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ట్రైనింగ్ ప్రాసెస్ పూర్తి అయిందన్నారు. పోలింగ్ కోసం ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని.. రిజర్వ్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక కోసం అన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. 1.5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల కోసం పనిచేయాల్సి ఉందన్నారు. 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 50వేల కంటే ఎక్కువ నగదు ఉంటే పేపర్లు అందుబాటులో ఉండాలని లేదంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
PM Modi: కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన మోదీ.. ఆ ఇద్దరికీ వార్నింగ్..!
Tamilisai: తమిళిసై రాజీనామాకు కారణాలేంటి?
ప్రజలు ఫిర్యాదుల కోసం c - విజిల్ యాప్ లేదా1950 నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలకు అనుమతిని సువిధా యాప్ ద్వారా తీసుకోవాలన్నారు. 7లక్షల ఓటర్ కరెక్షన్లను అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి చేశామని తెలిపారు. చిన్న పార్లమెంట్ మహబూబాబాద్ కాగా అతిపెద్ద ఎంపీ సెగ్మెంట్ మల్కాజిగిరి అని వివరించారు. నేతల రోడ్ షోలు సెలవు రోజుల్లోనే పెట్టుకోవాలని.. రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్ షోలకు అనుమతి లేదని చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి అవకాశం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను, స్కూల్ డ్రెస్‌లకు అనుమతి లేదని తెలిపారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రాసెస్ జరుగుతోందని.. షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరుగుతుందని సీఈఓ వికాస్‌రాజ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Jeevan Reddy: ‘మీరే మూసి మీరే తెరుస్తా అంటారా’.. ప్రధాని మోదీపై జీవన్‌రెడ్డి ఫైర్
Rammohan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం మోదీ తరం కాదు
Vinod Kumar: దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 18 , 2024 | 06:44 PM