TDP: అన్నే రామకృష్ణ మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం
ABN, Publish Date - Jul 14 , 2024 | 12:44 PM
అమరావతి: ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నె రామకృష్ణ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు.
అమరావతి: ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నె రామకృష్ణ (Anne Ramakrishna) మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి లోకేష్ (Minister Lokesh) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ సమర్థవంతంగా పనిచేశారని, ఓటర్ వెరిఫికేషన్‌లో మంచి అనుభవం ఉన్న ఆయన ఓటర్ రామకృష్ణగా అందరూ పిలిచేవారని చంద్రబాబు గుర్తుచేశారు. రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. టీడీపీ నేత.. ఓటర్ రామకృష్ణగా అందరికి సుపరిచితులైన అన్నే రామకృష్ణ అన్న హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించిన ఓటర్ రామకృష్ణ అన్నకు అశ్రునివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. టీడీపీ ఓటర్ వెరిఫికేషన్ విభాగానికి ఆయన ఎనలేని సేవలందించారన్నారు. ఓటర్ రామకృష్ణ అన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వం పంతాలు, పట్టింపులు, బేషజాలకు పోకుండా..:
కాసేపట్లో తెరుచుకోనున్న పూరీ ఆలయ రత్నభాండాగారం..
కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ
పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారు: యనమల
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 14 , 2024 | 12:44 PM