ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: తిరుమల లడ్డూ అపవిత్రం.

ABN, Publish Date - Sep 19 , 2024 | 04:16 AM

వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • వైసీపీ హయాంలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారు

  • అన్న ప్రసాద నాణ్యతా తగ్గించారు

  • మేము మంచి నెయ్యి తెప్పించాం

  • ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి నిత్యాన్న ప్రసాదం వరకు అన్నింటినీ సర్వనాశనం చేశారని తెలిపారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించి తయారు చేయాల్సిన శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిపారని చెప్పారు. ‘‘తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా మార్చేశారు. ఎన్ని ఫిర్యాదుల చేసినా శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అయినా.. తిరుమలలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. చివరకు అన్న ప్రసాదంలోనూ నాణ్యత లేకుండా చేశారు.


సాక్షాత్తూ స్వామి దగ్గర పెట్టే ప్రసాదం కూడా అపవిత్రం చేశారు. నాసిరకం సరుకులే కాకుండా, లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు. ఈ రోజు స్వచ్ఛమైన నెయ్యి తెమ్మన్నాం. ప్రక్షాళన చేయమని చెప్పాం. ఇప్పుడు నాణ్యత పెరిగింది. ఇంకా నాణ్యత పెంచుతాం. వేంకటేశ్వరస్వామి మనరాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఆయన కోసం ప్రపంచం మొత్తం మన దగ్గరకి వస్తోంది. అలాంటప్పడు తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 04:16 AM

Advertising
Advertising