ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chilukur: చిలుకూరులో 30 వరకు 144 సెక్షన్‌..

ABN, Publish Date - Jul 27 , 2024 | 11:57 AM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు(Chilukur)లో 144 సెక్షన్‌ కొనసాగుతున్నది. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్‌.134లో ఓ ప్రవాస భారతీయుడికి పట్టా భూమి ఉంది. దాని పక్కనే మరో సర్వే నంబర్‌ 133లో వక్ఫ్‌బోర్డు(Wakf Board)కు చెందిన పురాతన స్థలం, ఓ కట్టడం ఉంది.

- మత ఘర్షణలు తలెత్తకుండా పోలీసుల పహారా

మొయినాబాద్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు(Chilukur)లో 144 సెక్షన్‌ కొనసాగుతున్నది. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్‌.134లో ఓ ప్రవాస భారతీయుడికి పట్టా భూమి ఉంది. దాని పక్కనే మరో సర్వే నంబర్‌ 133లో వక్ఫ్‌బోర్డు(Wakf Board)కు చెందిన పురాతన స్థలం, ఓ కట్టడం ఉంది. అయితే, ఓ వర్గానికి చెందిన స్థలంలో నిర్మాణం తొలగించడంపై రెండు వర్గాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మతపరమైన వివాదాలకు దారితీయకుండా సైబరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌(Rajendranagar DCP Chintamaneni Srinivas) రెండు వర్గాల వారికి నచ్చజెప్పి ఎవరినీ అక్కడికి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదికూడా చదవండి: JNTU: జేఎన్‏టీయూలో ఈవెనింగ్‌ బీటెక్‌..


వక్ఫ్‌బోర్డు స్థలం వద్దకు వెళ్లకుండా ఉండేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. హిమాయత్‌నగర్‌ చౌరస్తా, చిలుకూరు బాలాజీ ఆలయం(Chilukur Balaji Temple) వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. పురాతన కట్టడం వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. బాలాజీ ఆలయానికి వచ్చే భక్తులను సైతం వివరాలు అడిగిన తర్వాతనే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ నెల 30 వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని మొయినాబాద్‌ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కావడంతో ఓ వర్గం వారు ప్రార్థనలు చేసిన తర్వాత ఎటువంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.


ఇదికూడా చదవండి: సాగర్‌ నీటి విడుదలకు మా సమ్మతి అక్కర్లేదా?

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 27 , 2024 | 11:57 AM

Advertising
Advertising
<