ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth : సీఎంఆర్‌ఎఫ్‌ అక్రమాలకు చెల్లు

ABN, Publish Date - Jul 03 , 2024 | 02:55 AM

ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎ్‌ఫ)లో అక్రమాలకు అవకాశం లేకుండా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

ఇక నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్‌లోనే

వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎ్‌ఫ)లో అక్రమాలకు అవకాశం లేకుండా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి ఈ పథకం కోసం వచ్చే దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారానే స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ ఛిఝటజ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ ను సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు. సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు పక్కదారి పెట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. సీఎంఆర్‌ఎఫ్‌ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖను జతచేసి కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్‌లో దరఖాస్తుదారుల బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్‌ చేసిన తర్వాత ఒక కోడ్‌ ఇస్తారు. దాని ఆధారంగా ఒరిజినల్‌ మెడికల్‌ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్‌ను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్‌ఎఫ్‌ అప్లికేషన్‌ను ఆమోదించి చెక్‌ సిద్ధం చేస్తారు. చెక్‌పై తప్పనిసరిగా దరఖాస్తుదారుడి అకౌంట్‌ నంబర్‌ను ముద్రిస్తారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్‌ను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. కాగా, సీఎంఆర్‌ఎ్‌ఫలో అక్రమాలను అరికట్టడానికి సర్కారు కసరత్తు మొదలుపెట్టిందని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. సీఎంఆర్‌ఎఫ్‌ వ్యవస్థలో పారదర్శకత, మెరుగైన సేవల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని జూన్‌ 8న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది.

Updated Date - Jul 03 , 2024 | 09:41 AM

Advertising
Advertising