ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మలి దశ ఉద్యమంలో అగ్రగణ్యుడు గద్దర్‌: సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Aug 07 , 2024 | 04:25 AM

‘తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యుడు.. పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ద నౌక.. గద్దర్‌’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.

హైదరాబాద్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యుడు.. పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ద నౌక.. గద్దర్‌’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన చేసిన సాంస్కృతిక, సాహిత్య సేవకు గుర్తింపుగా నంది అవార్డులను గద్దర్‌ అవార్డులుగా తమ ప్రభుత్వం మార్చిందనీ గుర్తు చేశారు. మంగళవారం గద్దర్‌ వర్ధంతి సందర్భంగా ఆయనతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా’ అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టుగా గద్దర్‌ నిలిచారన్నారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించిన గద్దర్‌.. ఉన్నత కొలువుల వైపునకు దృష్టి సారించకుండా ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, నీడ లభించాలన్న లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్య పరిచారన్నారు. తెలంగాణ జనసభలతో పాటుగా పలు ఉద్యమ సంస్థలను ఏర్పాటు చేశారనీ గుర్తు చేశారు.

Updated Date - Aug 07 , 2024 | 04:25 AM

Advertising
Advertising
<