ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌..

ABN, Publish Date - Aug 30 , 2024 | 04:12 AM

గణేష్‌ మండపాల నిర్వాహకులు ముందస్తుగా అనుమతి తీసుకుంటే ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

  • కచ్చితంగా ముందే అనుమతి తీసుకోవాలి.. శోభా యాత్రలో లోటుపాట్లకు తావివ్వొద్దు

  • గణేశ్‌ ఉత్సవాలపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ మండపాల నిర్వాహకులు ముందస్తుగా అనుమతి తీసుకుంటే ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా విద్యుత్‌ వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గణేష్‌ ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు చేసిన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు.


జవాబుదారీతనం కోసమే అనుమతి తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌ ప్రతిష్ఠను మరిం త పెంచేలా గణేష్‌ ఉత్సవాల నిర్వహణ ఉండాలని, ఇందుకోసం ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వహకులు, అధికారులత సమన్వయంతో చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. మండపాల ఏర్పాటు నుంచి శోభాయాత్ర దాకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అనుమతులు తీసుకుంటే ఆయా ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్‌ తదితర ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎటువంటి లోటుపాట్లకు తావివ్వద్దని, జోన్ల వారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎస్‌ శాంతికుమారిని ఆదేశించారు.


గత ఏడాది ఔటర్‌ రింగు రోడ్డు పరిధిలో 1.50 లక్షల విగ్రహాలు ఏర్పాటు చేశారన్న అంచనాలున్న నేపథ్యంలో మొత్తం విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌కే కాకుండా ఇతర చెరువుల్లోనూ నిమజ్జనం చేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. దీంతో సాగర్‌ వద్ద రద్దీ తగ్గడంతో పాటు ఆయా చెరువుల వద్ద నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ముందుగానే చేసే వీలుంటుందన్నారు. ఈ విషయంలో ఉత్సవ సమితి సభ్యులు, మండప నిర్వాహకులు ముందగానే సమాచారం ఇవ్వాలని సూచించారు. 17న నిమజ్జనం ఉండగా.. అదే రోజున తెలంగాణ విలీన దినం ఉందని గుర్తు చేశారు.


ఆయా పార్టీలు పలు కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలని పోలీసులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నగర పరిధిలోని నలుగురు ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. కాగా, నిమజ్జనం రోజైన సెప్టెంబరు 17వ తేదీన అనంత చతుర్దశి వచ్చిందని, ఆ రోజు ప్రాముఖ్యతను తెలుపుతూ దేవాదాయ శాఖ తరఫున ప్రచారం చేయాలని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి విజ్ఞప్తి చేయగా.. అవసరమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావును సీఎం ఆదేశించారు.


మండపాల్లో డీజేలు వాడేందుకు అనుమతి ఇవ్వాలని ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కోరగా.. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తామని సీఎం స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిం చి పర్యావరణహిత విగ్రహాలను ప్రతిష్ఠించాలని మంత్రి శ్రీధర్‌బాబు ఉత్సవ సమితి బాధ్యులకు సూచించారు. గణేష్‌ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటిదాకా నిర్వహించిన సమావేశాలు, ఉత్సవ సమితి సభ్యులు చేసిన సూచనలు, పరిష్కరించిన సమస్యల వివరాలను మంత్రి పొన్నం వివరించారు. మొత్తం 25వేల మందితో భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు డీజీపీ జితేందర్‌, హైదరాబాద్‌ సీపీ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.


  • మిలాద్‌-ఉన్‌-నబీ ప్రదర్శనలు సెప్టెంబరు 19న

  • సర్కారు విజ్ఞప్తికి మిలాద్‌ కమిటీ సానుకూల స్పందన

మిలాద్‌-ఉన్‌-నబీ ప్రదర్శనలను సెప్టెంబరు 19న నిర్వహించేందుకు మిలాద్‌ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 16న మిలాద్‌ ఉన్‌ నబీని ఘనంగా నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. సంబంధిత ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా సెప్టెంబరు 7 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలు కొనసాగనున్న నేపథ్యంలో మిలాద్‌ ఉన్‌ నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం, మంత్రులు మిలాద్‌ కమిటీ సభ్యులను కోరారు. ఈ అంశంపై చర్చించే బాధ్యతను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్‌లీడర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీకి అప్పగించారు. సమీక్ష అనంతరం వారు మరోసారి సమావేశమై విజ్ఞప్తి చేయగా.. మిలాద్‌ కమిటీ సభ్యులు సానుకూలత వ్యక్తం చేశారు. అయితే, మహ్మద్‌ ప్రవక్త వచ్చే ఏడాది మహ్మద్‌ ప్రవక్త 1500వ జన్మదినం నేపథ్యంలో.. ఏడాది పాటు ఉత్సవాల నిర్వహణకు అనుమతించాలని కమిటీ సభ్యులు కోరగా.. నిబంధనల ప్రకారం అనుమతులిస్తామని సీఎం చెప్పారు.

Updated Date - Aug 30 , 2024 | 04:12 AM

Advertising
Advertising