ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy : తెలంగాణ ఏర్పడ్డాక క్రీడలను నిర్లక్ష్యం చేశారు

ABN, Publish Date - Oct 04 , 2024 | 04:30 AM

ప్రత్యే రాష్ట్రం ఏర్పడ్డాక క్రీడలను నిర్లక్ష్యం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌ అన్నారు. తమ పదేళ్ల హయాంలో క్రీడలకు బీఆర్‌ఎస్‌ సర్కారు చేసిందేమీలేదన్నారు.

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రత్యే రాష్ట్రం ఏర్పడ్డాక క్రీడలను నిర్లక్ష్యం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌ అన్నారు. తమ పదేళ్ల హయాంలో క్రీడలకు బీఆర్‌ఎస్‌ సర్కారు చేసిందేమీలేదన్నారు. రాష్ట్రంలోని స్టేడియాల దుస్థితి, క్రీడాకారులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆవేదనకు గురయ్యానని చెప్పారు. తమ ప్రభుత్వం హైదరాబాద్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే గచ్చిబౌలి స్టేడియం ఆధునికీకరణకు రూ.20 కోట్లు కేటాయించడంతో పాటు ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ను నిర్వహించామని చెప్పారు.


గురువారం ఎల్బీ స్టేడియంలో ‘సీఎం కప్‌’ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో రేవంత్‌ పాల్గొన్నారు. పాలపిట్ట రూపంతో తయారు చేసిన మస్కట్‌ ‘నీలమణి’ని, సీఎంకప్‌ లోగోను ఆవిష్కరించారు. బాక్సింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌, ఒలింపియన్‌ నిఖత్‌ జరీన్‌కు డీఎస్పీ బ్యాడ్జ్‌ను అందించారు. యువ ఆర్చర్‌ చికితరావుతో సహా సుమారు 50 మంది క్రీడాకారులకు 1.02 కోట్ల విలువైన చెక్కులను అందించారు. నిరుడు నిర్వహించిన సీఎంక్‌పలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు రూ.52 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.


బీసీ రాయ్‌ సాకర్‌ ట్రోఫీ నెగ్గిన తెలంగాణ జట్టుకు రూ.2 లక్షల చెక్కు ప్రదానం చేయడంతో పాటు రాష్ట్ర ఫుట్‌బాల్‌ జట్టును దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు.రానున్న రోజుల్లో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీతో పాటు అకాడమీని ప్రారంభించి క్రీడాకారులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. టార్గెట్‌ 2028 ఒలింపిక్స్‌గా క్రీడాకారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Updated Date - Oct 04 , 2024 | 04:30 AM