ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం..

ABN, Publish Date - Sep 30 , 2024 | 04:15 AM

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

  • వారు బాగుంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది

  • ‘పింక్‌ పవర్‌ రన్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ/ గచ్చిబౌలి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌), సుధారెడ్డి ఫౌండేషన్‌ సంయుక్తంగా గచ్చిబౌలి స్టేడియం వద్ద నిర్వహించిన ‘పింక్‌ పవర్‌ రన్‌’లో రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో విజేతలను సీఎం రేవంత్‌ సత్కరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు సంఘీభావంగా నగరవాసులు పింక్‌ పవర్‌ రన్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహిళల కోసం మరిన్ని ఆస్పత్రులను నిర్మించనున్నట్లు తెలిపారు. మహిళా సంక్షేమం, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. ఈ సందర్భంగా మేఘా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యమే సంపద అన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఈ రన్‌ నిర్వహించామని, భవిష్యత్‌లో ఈ తరహా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని తెలిపారు.


గచ్చిబౌలి స్టేడియం నుంచి 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో ఈ రన్‌ నిర్వహించారు. విద్యార్థులు, ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు, ఔత్సాహికులు.. దాదాపు 12 వేల మంది ఈ పరుగులో పాల్గొన్నారు. రన్‌లో భాగంగా గిన్ని్‌సబుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించేందుకు పక్షి ఆకారంలో అతి పెద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్‌, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శాట్‌ చైర్మన్‌ శివసేనా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 04:15 AM