CM Revanth Reddy: బాచుపల్లి ఘటనపై రేవంత్ ఆరా
ABN, Publish Date - May 08 , 2024 | 09:41 AM
రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి చెందారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుండపోత వర్షం పడడంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు రేవంత్‌కు అధికారులు తెలిపారు.
హైదరాబాద్: రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి చెందారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుండపోత వర్షం పడడంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు రేవంత్‌కు అధికారులు తెలిపారు. భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో ఏడుగురు మృతి చెందారని.. మరో నలుగురికి గాయాలైనట్లు తెలిపారు. చనిపోయిన వారు ఒరిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చనిపోయిన వారిలో నాలుగు సంవత్సరాల బాబు, ఒక మహిళ, ఐదుగురు పురుషులు ఉన్నట్లు రేవంత్‌కు అధికారులు తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు
ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్
Read Latest Telangana News and National News
Updated Date - May 08 , 2024 | 09:41 AM