CM Revanth: మోదీ, ఫాంహౌస్ కేడీ తెలంగాణను దోపిడీ చేశారు.. సీఎం రేవంత్ విసుర్లు
ABN, Publish Date - Apr 19 , 2024 | 06:43 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫామ్ హౌస్ కేడీ తెలంగాణను దోపిడీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ‘జన జాతర’ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దిగిపో దిగిపో అంటున్నావ్... ఉత్తగ వచ్చామా బిడ్డా అని కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.
మహబూబాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫామ్ హౌస్ కేడీ తెలంగాణను దోపిడీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ‘జన జాతర’ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
దిగిపో దిగిపో అంటున్నావ్... ఉత్తగ వచ్చామా బిడ్డా అని కేసీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. ఆగష్టు 15వ తేదీలోగా రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు రూ. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు.
CM Revanth: కేసీఆర్ కాలం చెల్లింది.. కారు షెడ్డుకు పోయింది.. సీఎం రేవంత్ వ్యంగ్యాస్త్రాలు
మానుకోట కాంగ్రెస్ కంచుకోట అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహబూబాబాద్ ప్రాంతం విధ్వంసమైందని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెచ్చిన చట్టాలకు కేసీఆర్ మద్దతు తెలిపారని అన్నారు. తండ్రి రెడ్యానాయక్‌ను ఇంటికి పంపినట్టే బిడ్డ మాలోతు కవితను కూడా ఇంటికి పంపాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మోదీ ప్రభుత్వం పక్కకు పెట్టిందని మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ మంజూరు చేస్తే... మోదీ లాథూర్‌కు తరలించుకుపోయారని విరుచుకుపడ్డారు. ములుగు గిరిజన యూనివర్సిటీని సోనియా గాంధీనే మంజూరు చేశారని గుర్తుచేశారు.
TG Elections: బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలు.. జగ్గారెడ్డి విసుర్లు
ఈ ప్రాంత ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకి లేదని చెప్పారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోదీ తెలంగాణను అవమాన పరిచారని ధ్వజమెత్తారు. అప్పుడు పార్లమెంట్‌లోతానే ప్రత్యక్ష సాక్షినని గుర్తుచేశారు. ఉత్తర భారతదేశంలోని కుంభమేళాకు మోదీ వేల కోట్లు ఖర్చు చేశారని.. మేడారం జాతరకు కేవలం రూ.3 కోట్లు ఇచ్చారని దుయ్యబట్టారు.
మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వబోమని చెప్పిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఓట్లు అడగడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్‌ను కేసీఆర్ మోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేంద్ర మంత్రి పథవుల్లోనూ తెలంగాణకు అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు. ఢిల్లీలో రైతులను మోదీ ప్రభుత్వం కాల్చి చంపిందని ఆరోపించారు. 100రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
TS Politics: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?
Congress: రైతుల రుణమాఫీ ఎప్పుడో చెప్పిన మంత్రి పొన్నం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 19 , 2024 | 07:02 PM