ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఆ అంశాలపై చర్చ..

ABN, Publish Date - Jul 22 , 2024 | 05:34 PM

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర జ‌ల్‌ శ‌క్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌(Central Minister CR Patil)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది డెవలప్మెంట్, రాష్ట్రంలోని ఇళ్లకు నల్లా కనెక్షన్ల కోసం పెద్దఎత్తున నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.

ఢిల్లీ: రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర జ‌ల్‌ శ‌క్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌(Central Minister CR Patil)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది డెవలప్మెంట్, రాష్ట్రంలోని ఇళ్లకు నల్లా కనెక్షన్ల కోసం పెద్దఎత్తున నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.


తెలంగాణ ప్రభుత్వం రూ.1.5లక్షల కోట్లతో చేప‌డుతున్న మూసీ రివర్ ప్రక్షాళనకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మురికి నీరంతా మూసీలో చేరుతోంద‌ని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంక‌ల్పించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు. జాతీయ న‌దీ ప‌రిరక్షణ ప్రణాళిక కింద మురికి నీటి శుద్ధి ప‌నులకు రూ.4వేల కోట్లు కేటాయించాలని పాటిల్‌ను కోరారు. అలాగే గోదావ‌రి న‌దీ జ‌లాల‌తో ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్‌లను నింపే ప‌నుల‌ కోసం మరో రూ.6వేల కోట్లు కేటాయించాల‌ని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.


ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను గోదావ‌రి నీటితో నింపితే హైద‌రాబాద్‌కు నీటి కష్టాలు ఉండ‌వ‌ని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. 2019లో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప్రారంభ‌మైనా తెలంగాణకు ఇంతవరకూ నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 7.85లక్షల ఇళ్లకు న‌ల్లా కనెక్షన్ లేద‌ని పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. న‌ల్లా లేని ఇళ్లతోపాటు పీఎంఏవై అర్బన్, రూర‌ల్‌ కింద చేప‌ట్టే ఇళ్లకు సైతం నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు రూ.16,100 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. ఈ ఏడాది నుంచి తెలంగాణకు జ‌ల్‌ జీవ‌న్ మిష‌న్ నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్‪ను తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

Updated Date - Jul 22 , 2024 | 05:35 PM

Advertising
Advertising
<