ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: నిమిషం కూడా కరెంట్‌ పోవద్దు!

ABN, Publish Date - Sep 05 , 2024 | 04:11 AM

రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

  • సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు

  • రాష్ట్రం బిజినెస్‌ హబ్‌ కాబోతోంది

  • భవిష్యత్‌ అవసరాలకనుగుణంగా

  • విద్యుత్తు అందుబాటులో ఉండాలి

  • ఖాళీ భూముల్లో సోలార్‌ ప్లాంట్లు

  • రైతులకు ఫ్రీగా సౌర పంపులివ్వాలి

  • విద్యుత్తుపై సమీక్షలో ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఉండకూడదన్నారు. తెలంగాణ ఒక బిజినెస్‌ హబ్‌గా మారనుందని.. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఐటీ, పరిశ్రమల శాఖలతో సమన్వయం చేసుకొని, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. బుధవారం ఆయన తన నివాసంలో విద్యుత్తు శాఖపై సమీక్ష నిర్వహించారు.


ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌, డిస్కంల సీఎండీలు ముషారఫ్‌ అలీ ఫారూఖీ, కర్నాటి వరుణ్‌రెడ్డి, సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సౌర విద్యుత్తు వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ శాఖల పరిధిలో వినియోగంలో లేని భూముల్లో సోలార్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అటవీ భూముల్లో కూడా సోలార్‌ యూనిట్లు పెట్టాలని సూచించారు.


  • రైతులకు ఉచితంగా పంపులు

సౌర విద్యుత్తు వినియోగాన్ని గణనీయంగా పెంచాలని సీఎం రేవంత్‌ చెప్పారు. అందుకోసం రైతులకు సోలార్‌ పంపు సెట్లను ఉచితంగా అందించాలన్నారు. నాగర్‌కర్నూలుజిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లెను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ఈ పథకాన్ని అమలు చేయాలని తెలిపారు. ఉచిత పంపు సెట్ల కార్యక్రమం అమలు కోసం ‘పీఎం కుసుమ్‌’ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. రైతులు కూడా తమ భూముల్లో సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకొనేలా ప్రోత్సహించాలని సూచించారు. అక్కడ ఉత్పత్తయిన విద్యుత్తును పంపుసెట్లకు వాడుకున్న తర్వాత మిగిలిన దాన్ని డిస్కమ్‌లు కొనుగోలు చేసి, రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వంటగ్యాస్‌ బదులుగా సౌర విద్యుత్తును వాడుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వీటిపై మహిళా సంఘాలకు శిక్షణ అందించి, వారు సౌర విద్యుత్తు వ్యాపారంలోకి అడుగుపెట్టేలా చూడాలని సూచించారు.


  • 40 వేల మెగావాట్ల సామర్థ్యం సాధించాలి

రాష్ట్రంలో విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 40 వేల మెగావాట్లకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక లోడ్‌ను తగ్గించుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వినియోగదారులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

Updated Date - Sep 05 , 2024 | 04:11 AM

Advertising
Advertising