CM Revanth Reddy: ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి..
ABN, Publish Date - Jul 21 , 2024 | 08:51 PM
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇరిగేషన్ వ్యవస్థపై దేశ రాజధానిలోని ఆయన నివాసంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి అధికారిక నివాసంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు అధికారులు పాల్గొన్నారు.
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇరిగేషన్ వ్యవస్థపై దేశ రాజధానిలోని ఆయన నివాసంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి అధికారిక నివాసంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే శనివారం రోజున డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌తో ఉత్తమ్ కుమార్, ఇరిగేషన్ అధికారులు భేటీ అయిన సంగతి తెలిసిందే. సోమవారం రోజున మరోసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో సమావేశం కానున్న నేపథ్యంలో పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి వారితో చర్చించారు.
అయితే శనివారం రోజున డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌తో జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సుదీర్ఘ చర్చ జరిగింది. బీఆర్ఎస్ హయాంలో కమీషన్లు ఎక్కువగా వస్తాయని ప్రభుత్వ నిధులు అధికంగా ఖర్చు చేశారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుడు వెదిరే శ్రీరామ్ కమిషన్‌కు అఫిడవిట్ ఇచ్చారు. అయితే సోమవారం జరిగే సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించాలి, ఏఏ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లాలనే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రి ఉత్తమ్, నీటిపారుదల శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
Updated Date - Jul 21 , 2024 | 08:51 PM