ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy : వంద శాతం నీళ్లు అబద్ధం!

ABN, Publish Date - Jul 31 , 2024 | 03:24 AM

మిషన్‌ భగీరథ ఎంతమందికి అందిందనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే ముగిసింది. 7.50 లక్షల ఇళ్లకు మిషన్‌ భగీరథ నీళ్లు అందడం లేదని తేలింది. ఈ మేరకు పూర్తి స్థాయి నివేదిక ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డికి అందింది.

  • మిషన్‌ భగీరథ అందని ఇళ్లు 7.5 లక్షలు

  • సీఎం చేతికి ఇంటింటి సర్వే నివేదిక

హైదరాబాద్‌, జూలై30 (ఆంధ్రజ్యోతి): మిషన్‌ భగీరథ ఎంతమందికి అందిందనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే ముగిసింది. 7.50 లక్షల ఇళ్లకు మిషన్‌ భగీరథ నీళ్లు అందడం లేదని తేలింది. ఈ మేరకు పూర్తి స్థాయి నివేదిక ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డికి అందింది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం కింద వంద శాతం కుటుంబాలకు తాగునీరు ఇస్తున్నట్లు కేంద్ర విభాగాలకు సమాచారం అందించింది. దీంతో జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు అందలేదనే ఆరోపణ ఉంది.

తాజా సర్వేలో ఇంకా ఏడున్నర లక్షల ఇళ్లకు తాగునీటి సదుపాయం కల్పించాలని తేలడంతో మిషన్‌ భగీరథను కేంద ప్రభుత్వ పథకం జల్‌ జీవన్‌ మిషన్‌తో అనుసంధానించి, కేంద్రం నిధులు రాబట్టేందుకు అవకాశం ఏర్పడింది. తాజా నివేదిక ప్రకారం.. 12,769 పంచాయతీల పరిధిలో 55 లక్షల ఇళ్లు ఉన్నాయి.

అందులో 7.50 లక్షల ఇళ్లకు భగీరథ అందడం లేదు. 4.50 లక్షల ఇళ్లకు అసలు నల్లా కనెక్షన్లే లేవు. 3 లక్షల ఇళ్లకు స్థానిక నీటి వనరుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్‌ భగీరథ కింద చాలా మంది పలుకుబడి ఉపయోగించుకొని ఇంటికి రెండు, మూడు నల్లా కనెక్షన్లు తీసుకున్నట్లు గుర్తించారు.

Updated Date - Jul 31 , 2024 | 03:24 AM

Advertising
Advertising
<