ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam: నేడు నల్లగొండకు రేవంత్‌

ABN, Publish Date - Dec 07 , 2024 | 02:56 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు.

  • నల్లగొండలో భారీ బహిరంగసభ

  • సభ ద్వారా అద్భుతమైన సందేశం ఇవ్వబోతున్నాం: ఉత్తమ్‌

  • చరిత్ర సృష్టించనున్న సభ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రుల బృందంతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి హెలికాప్టర్‌ ద్వారా ఉదయం 11 గంటలకు నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల చేరుకుంటారు. అక్కడ నిర్మించిన బ్రాహ్మణవెల్లెంల - ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం రిజర్వాయర్‌లోకి నీటి పంపింగ్‌ను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. అక్కడినుంచి దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎ్‌స)లోని 800 మెగావాట్ల యూనిట్‌-2 నుంచి విద్యుదుత్పాదన చేపట్టే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు.


అనంతరం హెలికాప్టర్‌లో నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రారంభిస్తారు. అక్కడే నూతనంగా నిర్మించతలపెట్టిన నర్సింగ్‌ కళాశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి, కనగల్‌, తిప్పర్తి జూనియర్‌ కాలేజీల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేసిన అనంతరం మెడికల్‌ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన రాజీవ్‌ ప్రాంగణంలో భారీ బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, బ్రాహ్మణవెల్లెంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండలో శనివారం నిర్వహించే బహిరంగసభ ద్వారా రాష్ట్రానికి అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నామని ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండలో నిర్వహించే సభ చరిత్ర సృష్టించబోతోందన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 02:56 AM