CM Revanth Reddy: ఆగస్టులో అమెరికాకు సీఎం రేవంత్
ABN, Publish Date - Jul 12 , 2024 | 03:34 AM
తెలంగాణలో పెట్టుబడుల సమీకరణ నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులో అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించనున్నారు.
దక్షిణ కొరియాకు కూడా.. పెట్టుబడులే లక్ష్యంగా..
హైదరాబాద్, జూలై 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెట్టుబడుల సమీకరణ నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులో అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాల్లోని పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులను సమీకరించే అవకాశం ఉందని తెలిసింది. విదేశీ పర్యటనకు సీఎంతోపాటు పరిశ్రమలు, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. సీఎం నేతృత్వంలోని బృందం ఆగస్టు 4 నుంచి 9వ తేదీ మధ్య అమెరికాలో పర్యటించనుంది.
న్యూయార్క్, డల్లాస్, శాన్‌ప్రాన్సి్‌సకో, న్యూ జెర్సీ ప్రాంతాల్లో ప్రముఖ వ్యాపార వేత్తలతో సీఎం సమావేశం అవుతారు. లైఫ్‌సైన్స్, ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థలు, టెక్నాలజీ రంగంలో ఉండే వ్యాపారుల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేలా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం దక్షిణ కొరియా పర్యటనలోనూ ఎలకా్ట్రనిక్స్, టెక్స్‌టైల్, లైఫ్‌సైన్స్, ఎలకా్ట్రనిక్ వాహనాల తయారీ సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.
Updated Date - Jul 12 , 2024 | 03:34 AM