Collector: పని చేయలేకుంటే సెలవుపై వెళ్లండి...
ABN, Publish Date - Oct 25 , 2024 | 12:54 PM
‘మీలో ప్రతీ ఒక్కరి పనితీరు నాకు తెలుసు.. నా నుంచి మీరు తప్పించుకోలేరు.. కచ్చితంగా పని చేయాల్సిందే.. మున్నేరు వరదలకు కారణం మీరే.. మీ వేతనాలకు కోత వేయించాల్సింది. కానీ చేయలేదు. మీ జాబ్ చార్టు మేరకు పనిచేయండి, పని చేయలేకుంటే సెలవ్‌పై వెళ్లండి..’ అంటూ కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్(Collector Muzammil Khan) ఖమ్మం నగర పాలక సంస్థ విభాగాల అధికారులను హెచ్చరించారు.
- మీలో ప్రతీ ఒక్కరి పనితీరు నాకు తెలుసు
- అక్రమ నిర్మాణాలకు పునాదులు పడకుండానే చర్యలు తీసుకోవాలి
- నిబంధనలు పాటించని బిల్డర్లు, కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలి
- పారిశుధ్య కార్యక్రమాలపై కార్యాచరణ ఉండాలి: కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
- ఖమ్మం నగర పాలక సంస్థపై గరంగరంగా సమీక్ష
ఖమ్మం: ‘మీలో ప్రతీ ఒక్కరి పనితీరు నాకు తెలుసు.. నా నుంచి మీరు తప్పించుకోలేరు.. కచ్చితంగా పని చేయాల్సిందే.. మున్నేరు వరదలకు కారణం మీరే.. మీ వేతనాలకు కోత వేయించాల్సింది. కానీ చేయలేదు. మీ జాబ్ చార్టు మేరకు పనిచేయండి, పని చేయలేకుంటే సెలవ్‌పై వెళ్లండి..’ అంటూ కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్(Collector Muzammil Khan) ఖమ్మం నగర పాలక సంస్థ విభాగాల అధికారులను హెచ్చరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Telangana: కేటీఆర్ పరువు నష్టం కేసులో మంత్రి సురేఖకు షాక్..
కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజలతో కలిసి ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, పారిశుధ్యం, రెవెన్యూ విభాగాల అధికారులతో గంటన్నరపాటు సమీక్ష నిర్వహించారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవటంలో అధికారులు విఫలం చెందటంతోనే మున్నేరు వరదపోటు ఖమ్మంలోకి వ్యాపించిందని, ఖానాపురం ఊరచెర్వు నీరు పలు డివిజన్లపై చేరి అతలాకుతలం చేసిందని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ కాలేజీల అక్రమ నిర్మాణాలను ఎందుకు అడ్డుకోలేక పోయారని టౌన్ ప్లానింగ్ అధికారిని కలెక్టర్ ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలు జరిగి, భవనాలు ప్రారంభమైన తర్వాత నోటీసులు ఇవ్వటం కాదని పునాదుల సమయంలో అడ్డుకోవాలని, నిబంధనలు పాటించని బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఉంటే వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. కేఎంసీ అనుమతులు లేకుండా వీధుల వెంట భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ప్రశ్నించారు. టౌన్ ప్లానింగ్ విభాగం పేదల పట్ల మానవత్వంతో పనిచేయాలని సూచించారు. పేదల విషయంలో నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి కూల్చీవేతలు చేపట్టవద్దని సూచించారు. కూల్చీ వేతల సమయంలో అక్రమ నిర్మాణదారులకు ముందస్తు సమాచారం ఇచ్చి పోలీసులను వెంట తీసుకొని వెళ్తున్నారని నిలదీశారు.
20శాతం మంది పారిశుధ్య కార్మికులు పని చేయకుండానే హాజరు నమోదు చేస్తున్నారు. పనితీరు మార్చుకోవాలని, చెత్త ఎక్కువగా ఉండే ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి ప్రతి నెల 20ప్రాంతాలను శుభ్రం చేయాలని ఆదేశించారు. ఖమ్మంనగరంలో ప్రజలకు కనీసం జవాన్లు ఎవ్వరో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. పారిశుద్య కార్మికుల ఆరోగ్య ప్రొపైల్ నిర్వాహణ చేపట్టాలని సూచించారు. కేఎంసీ పరిదిలో హోర్డింగ్‌లపై ట్యాక్స్‌లు వసూళ్లు చేయటం లేదని, తాగునీటి పంపుల బిల్లులు, ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్‌ల బిల్లులు వసూళ్లు జరగటం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రేడ్ లైసెన్స్‌లు కనీసం రెన్యూవల్స్ జరగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ ఉల్లా, ఈఈ కృష్ణలాల్, ఏసీపీ వసుంధర, ఆర్వో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సమావేశానికి కేఎంసీకి చెందిన పలువురు అధికారులు ఆలస్యంగా హాజరయ్యారు. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఉదయం 10.50 గంటలకు కేఎంసీ సమావేశానికి వచ్చి అధికారులు రాకపోవటంతో కమిషనర్ ఛాంబర్‌లోకి తిరిగి వెళ్లారు. పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు ఉదయం 11.10కు సమావేశానికి చేరారు. గంటన్నరపాటు జరిగిన సమావేశం ఖమ్మం నగర పాలక సంస్థలోని లోపాలను బయటపెట్టింది.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!
ఈవార్తను కూడా చదవండి: KTR: ఒకటి, రెండేళ్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలోనే సొంతంగా సీడ్ గార్డెన్: తుమ్మల
ఈవార్తను కూడా చదవండి: నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
Read Latest Telangana News and National News
Updated Date - Oct 25 , 2024 | 12:54 PM