ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: తెలంగాణలో మరో తొమ్మిదేళ్లు ప్రజాపాలన ఖాయం..

ABN, Publish Date - Dec 10 , 2024 | 12:13 PM

తెలంగాణ రాష్ట్రంలో మరో తొమ్మిదేళ్ల పాటు కాంగ్రెస్‌(Congress) నేతృత్వంలోని ప్రజాపాలన కొనసాగి తీరుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పారిజాత

- ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో తొమ్మిదేళ్ల పాటు కాంగ్రెస్‌(Congress) నేతృత్వంలోని ప్రజాపాలన కొనసాగి తీరుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బడంగ్‌పేట్‌(Badangpet)లోని గ్రీన్‌రిచ్‌ ఎవెన్యూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నా రు. ఈ సందర్భంగా సోనియా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చలో దుబాయ్‌.. జనవరి 12 వరకు షాపింగ్‌ ఫెస్టివల్‌


అనంతరం ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌(BRS) పాలనలో రాష్ట్రం అప్పులకుప్పగా మారితే కాంగ్రెస్‌ ప్రభు త్వం అప్పులను అధిగమిస్తూ దశలవారీగా ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తున్నదని అన్నారు. కార్యక్రమం లో కార్పొరేటర్లు ప్రభాకర్‌రెడ్డి, పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పన్నాల రాజేందర్‌రెడ్డి, నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, నవారు మల్లారెడ్డి, నరహరిగౌడ్‌, రమేశ్‌గౌడ్‌, మనోహర్‌, శ్యాంసుందర్‌రెడ్డి, కొండా శ్రావణ్‌కుమార్‌, రమాకాంత్‌, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.


మల్లాపూర్‌లో..

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా టీపీసీసీ కార్యదర్శి వై.అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్‌ చౌరస్తాల్లో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సర్కార్‌ నిజమైన ప్రజా పాలన అందిస్తున్నదని, గత పాలకుల అవినీతి కారణంగా రాష్ట్రం అప్పులపాలయిందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, టీపీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జంగారెడ్డి, అచ్చన శ్రీనివాస్‌, కృష్ణ, పుట్టగల్ల జగన్‌, జంగయ్య, సత్యనారాయణ, ఆంజనేయులు, శ్రీధర్‌, మహ్మద్‌బామ్‌, యూసుఫ్‌ పటేల్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం

ఈవార్తను కూడా చదవండి: Sangareddy: సోనియా,రాహుల్‌ ఇచ్చిన మాట తప్పరు

ఈవార్తను కూడా చదవండి: మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2024 | 12:13 PM