ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: ఝార్ఖండ్‌లో కాంగ్రెస్‌దే గెలుపు

ABN, Publish Date - Nov 02 , 2024 | 03:52 AM

ఝార్ఖండ్‌ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఝార్ఖండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఇన్‌చార్జ్‌లు నియోజకవర్గాలను వదిలి వెళ్లొద్దని చెప్పారు.

  • ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటా

  • ఝార్ఖండ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఝార్ఖండ్‌ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఝార్ఖండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఇన్‌చార్జ్‌లు నియోజకవర్గాలను వదిలి వెళ్లొద్దని చెప్పారు. రాంచీలో శుక్రవారం కాంగ్రెస్‌ ఝార్ఖండ్‌ సీనియర్‌ నేతలు, పీసీసీ నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడారు. ఝార్ఖండ్‌ ఎన్నికల్లో సీనియర్‌ పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే రామ్‌గఢ్‌, బొకోరో అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు.


కాంగ్రెస్‌ శ్రేణులు సమరోత్సాహంతో ఉన్నాయని.. రామ్‌గఢ్‌, బొకోరో స్థానాల్లో పక్కాగా గెలిచి తీరతామని అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను ఝార్ఖండ్‌లోనే ఉంటానని, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పెద్దలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని తెలిపారు. కాగా, ఝార్ఖండ్‌లో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపై శుక్రవారం సాయంత్రం రాంచీలో నేతలు కసరత్తు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌ భట్టి విక్రమార్క, ఝార్ఖండ్‌ పీసీసీ అధ్యక్షుడు కేశవ్‌ మహతో, పార్టీ సీనియర్‌ నేతలు మ్యానిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను పరిశీలించారు.

Updated Date - Nov 02 , 2024 | 03:52 AM