ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: పోడు రైతులకు సర్కారు అండ..

ABN, Publish Date - Oct 15 , 2024 | 03:16 AM

పోడు రైతులకు కాంగ్రెస్‌ సర్కారు అండగా ఉంటుందని, పోడు సాగు కోసం డ్రిప్‌ పథకాలు, ఉచితంగా బోర్లు, విద్యుత్తు సౌకర్యాలను కల్పించి ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

  • ఉచితంగా బోర్లతో పాటు విద్యుత్తు సౌకర్యం

  • ఇందిరమ్మ రాజ్యంలో పల్లెల అభివృద్ధి: తుమ్మల

రఘునాథపాలెం, అక్టోబరు 14 (ఆంరఽధజ్యోతి): పోడు రైతులకు కాంగ్రెస్‌ సర్కారు అండగా ఉంటుందని, పోడు సాగు కోసం డ్రిప్‌ పథకాలు, ఉచితంగా బోర్లు, విద్యుత్తు సౌకర్యాలను కల్పించి ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని మారుమూల గ్రామాలైనా రజబ్‌ఆలీనగర్‌, పంగిడి, ఎన్వీ బంజర పంచాయతీల్లో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన అభివృద్ధి పనులకు సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ హయాంలో అటవీ హక్కుల చట్టాన్ని రూపొందించి పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు ఉచితంగా హక్కు పత్రాలను పంపిణీ చేశారన్నారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులు, ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పోడు రైతులకు అటవీశాఖ నుంచి సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో వ్యవసాయ బోర్లు, విద్యుత్తు కనెక్షన్ల మంజూరు ఇబ్బందిగా ఉందన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని వాటిని పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. రఘునాథపాలెం మండలాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. నాగార్జునసాగర్‌ జలాలతో మండలంలో సాగు నీటి కొరత తీరుస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం ఏఎంసీ మాజీ చైర్మన్‌ రాధాకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 03:16 AM