ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

ABN, Publish Date - Nov 22 , 2024 | 03:22 AM

ప్రజాప్రభుత్వంపై బీజేపీ, బీఆర్‌ఎ్‌స చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు.

  • అభివృద్ధిని ప్రజలకు వివరించండి

  • కార్యవర్గ భేటీలో డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్‌ దిశానిర్దేశం

  • ‘ముఖాముఖి’లో ఫిర్యాదుల స్వీకరణ

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రభుత్వంపై బీజేపీ, బీఆర్‌ఎ్‌స చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయని విధంగా ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి చాటి చెప్పాలని దిశానిర్దేశం చేశారు. గురువారం గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో భట్టి మాట్లాడుతూ హైదరాబాద్‌, సైబరాబాద్‌ను తలదన్నేలా.. ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం జరగనుందన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం ప్రభుత్వం ముందుకెళ్తుంటే.. అమాయకులైన పేదలను రెచ్చగొడుతూ బీఆర్‌ఎస్‌, బీజేపీ అడ్డు పడుతున్నాయన్నారు.


ఇళ్లు కోల్పోయిన వారికి మూసీని అభివృద్ధి చేశాక.. తిరిగి అక్కడే ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే.. దేశానికే రోల్‌ మోడల్‌ కానుందన్నారు. ఇబ్రహీంపట్నంలో పేదలకు అసైన్‌ చేసిన 10వేల ఎకరాలను గత ప్రభుత్వం బలవంతంగా గుంజుకుందని, ఆ భూములను తిరిగి పేదలకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ అందరికీ న్యాయం చేస్తున్నామని.. త్వరలోనే మరికొందరికి నామినేటెడ్‌ పదవులు ఇస్తామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వివేక్‌, మరికొందరు నేతలు డిసెంబర్‌ 1న భారీ కార్యక్రమం నిర్వహించబోతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని మహేశ్‌గౌడ్‌ను ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ కోరారు.


  • మాది ప్రజల మధ్య పాలన..

గత ప్రభుత్వానిది గడీల మధ్య పాలన అయితే.. తమ ప్రభుత్వ పాలన ప్రజల మధ్య నడుస్తోందని భట్టి అన్నారు. గాంధీభవన్‌లో ‘మంత్రితో ముఖాముఖి’లో ఆయన పాల్గొని కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే పూర్తయితే ఇన్నాళ్లుగా వనరులు దోపిడీ చేసిన వారి ఆటలు సాగవన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని స్టాప్‌ అండ్‌ వర్కర్‌ యూనియన్‌ ప్రతినిధి బృందం కోరింది. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చేరికతో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ నేత కాట శ్రీనివా్‌సగౌడ్‌ అనుచరులు భట్టి, మహేశ్‌ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, పదవుల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని మహిళా కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశంలో మహేశ్‌గౌడ్‌ అన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 03:22 AM