ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gandhi Bhavan: రేపట్నుంచే గాంధీభవన్‌కు మంత్రుల రాక

ABN, Publish Date - Sep 24 , 2024 | 03:45 AM

వారంలో రెండ్రోజులు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఒక్కో మంత్రి అందుబాటులో ఉండే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వారంలో రెండ్రోజులు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఒక్కో మంత్రి అందుబాటులో ఉండే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతోనే ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ వారంలో బుధవారం దామోదర.. శుక్రవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గాంధీభవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఈ నేపథ్యంలోనే వారి వారి సమస్యలను తెలుసుకుని మంత్రులు పరిష్కరిస్తారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.


వచ్చే వారం బుధవారం గాంధీ జయంతి సందర్భంగా విరామం ఇచ్చారు. ఆ తర్వాత శుక్ర, బుధవారాల్లో వరుసగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావులు గాంధీభవన్‌లో కార్యకర్తలకు సమయం కేటాయించనున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం గత శుక్రవారమే ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆ రోజు మంత్రివర్గ సమావేశం ఉండడంతో ఈ బుధవారానికి వాయిదా పడింది.

Updated Date - Sep 24 , 2024 | 03:45 AM