Jeevan Reddy: తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా?
ABN, Publish Date - Dec 03 , 2024 | 05:07 AM
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
ఉనికి కోసమే మీ చార్జిషీటు: జీవన్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఉనికిని కాపాడుకునేందుకే ఏడాది కాంగ్రెస్ పాలనపై బీజేపీ.. చార్జిషీటును విడుదల చేసిందన్నారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించని బీజేపీ.. రైతుల గురించి మాట్లాడుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతులకు రుణమాఫీని అమలు చేశారా.. అని నిలదీశారు.
Updated Date - Dec 03 , 2024 | 05:07 AM